హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10 (విజయక్రాంతి): తమిళనాడు తరహాలోనే బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో చట్టం చేసి, అఖిల పక్షాన్ని కేంద్రానికి తీసుకెళ్లాలని.. పలువురు బీసీ సంఘాల నేతలు, వివిధ పార్టీల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అఖిల భారత బీసీ ఫెడరేషన్, బీసీ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ‘తెలంగాణ రాష్ర్టంలో సమగ్ర కులగణన నిర్వాహణ- జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్ల పెంపుపై బీసీ మేధావుల సమాలోచన’ అనే అంశంపై బీసీ సంక్షేమే సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన హైదరాబాద్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్‌లో శుక్రవారం సమావేశం నిర్వహించారు.
సమావేశానికి డాక్టర్ విజయ్ భాస్కర్, కుల్కచర్ల శ్రీనివాస్ సమన్వయకర్తలుగా వ్యవహా ముఖ్య అతిథిగా బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దయాకర్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, బీసీ కమిషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ బీఎస్ రాములు బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.