- ఈ విషయం జీవన్‌రెడ్డి ఆవేదనతో బయటపడింది
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): రాష్ర్టంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని కొన్ని నెలల నుంచి జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాజాగా అదే విషయం స్వయంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఆవేదనతో చెప్పారన్నారు.
తెలంగాణలో అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్ పరిస్థితి చూస్తుంటే ఆందోళన కలుగు తోందన్నారు. రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవటం, పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో దూరడంతో ఈ సమస్య తలెత్తిందని ఆయన చెప్పారు.
ఇకనైనా శాంతిభద్రతలు కాపాడే విషయంలో ప్రభుత్వ పెద్దలు వివేకంతో ఆలోచించాలని సూచించారు. పోలీసు ఉన్నతాధికారులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని కోరారు. రాష్ర్టంలో సమర్థవంతమైన పోలీ సు ఉన్నతాధికారులు ఉన్నారని, వారి పని వారిని చేసుకొనిస్తే శాంతి భద్రతలు, రాష్ర్టం లో సామరస్యాన్ని కాపాడగలుగుతారని పేర్కొన్నారు.