calender_icon.png 23 October, 2024 | 7:05 AM

ఈ మహా నగరానికి ఏమైంది..?: కేటీఆర్

11-07-2024 01:23:39 PM

హైదరాబాద్: నగరంలో శాంతిభద్రతలు క్షీణించడంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత నాయకత్వంలో పరిపాలనా అనుభవం లేకపోవడమే నగరం పతనానికి కారణమని ఆరోపించారు. పరిపాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాదు నుండి తెలంగాణ పల్లెటూరు వరకూ అంతటా కనిపిస్తోందన్నారు. పత్రికల్లో మొదటి పేజీ కథనాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రతిష్ఠ మసకబారడంపై ప్రతి ఒక్కరిలో ఆవేదన ఉందన్నారు. కమాండ్ కంట్రోల్ కేంద్రానికి సీఎం వెళ్తున్నా పోలీసింగ్ పై కమాండ్ ఏది? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పవర్ లోకి రాగానే గడియ గడియకు పవర్ కట్..? అని ఎద్దేవా చేశారు. చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్న రాజధానిపై శ్రద్ద లేకపోతే ఎలా? అన్నారు. హైదరాబాద్ దెబ్బతింటే రాష్ట్రానికే కాదు.. దేశానికీ నష్టం జరుగుతోందన్నారు. "బ్రాండ్ హైదరాబాద్" ఎందుకు మసకబారుతోంది? విశ్వనగరంగా ఎదుగుతున్న వేళ..  ఎందుకింత కళ కోల్పోతోందన్నారు. సగటు హైదరాబాదీకి కలుగుతున్న భావన ఇదన్న కేటీఆర్ హైదరాబాద్ ను ప్రేమించే ప్రతిఒక్కరిలో ఉన్న ఆవేదన కలుగుతోందన్నారు. పదేళ్ళు ప్రశాంతంగా ఉన్న నగరంలో వరుస హత్యలు.. అంతరాష్ట్ర ముఠాలు పేట్రేగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారురాజధాని హైదరాబాద్ లో శాంతి లేదు.. నగర ప్రజల జీవితాలకు భద్రత లేదని కేటీఆర్ పేర్కొన్నారు.