calender_icon.png 29 March, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాతవాహన యూనివర్సిటీకి లా, ఇంజినీరింగ్ కళాశాలలు మంజూరు

26-03-2025 01:25:55 AM

జీవో నెం. 18, 19 విడుదల రూ.67.08 కోట్ల మంజూరు

మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపిన వీసీ శాతవాహన యూనివర్సిటీకి లా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కా  పట్ల హర్షం వ్యక్తం చేస్తూ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లను  సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.

కరీంనగర్, మార్చి 25 (విజయక్రాంతి): శాతవాహన యూనివర్సిటీకీ లా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలు మంజూరయ్యాయి. శాతవాహన యూనివర్సిటీ ప్రారంభించినాటి నుంచి యూనివర్సిటీకి లా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని విద్యార్థులు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీకి లా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలు మంజూరు చేస్తూ జీవో నెం. 18, 19 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

పెద్దపల్లి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్ రెడ్డి శాతవాహన యూనివర్సిటీ పరిధిలో హుస్నాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీ, కరీంనగర్ లా కాలేజీని మంజూరు చేశారు. 2025- 25 విద్యాసంవత్సరానికి అడ్మినిస్టేటివ్ అనుమతి ఉత్తర్వులు జారీ చేశారు. లా కళాశాలలో ఒక్కో సంవత్సరానికి 60 సీట్ల చొప్పున 120 సీట్లు ఉండనున్నాయి. లా కళాశాలకు 22.96 కోట్లు మంజూరు చేశారు.

ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ సీఎస్, ఐటీ, ఇసీఈ విభాగాల్లో ఒక్కో ప్రోగ్రామ్లో 60 సీట్లు ఉండనున్నాయి. హుస్నాబాద్లో యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ నిర్మాణానికి 44.12 కోట్ల రూపాయలు ముజూరయ్యాయి.

శాతవాహన యూనివర్సిటీకి లా, ఇంజనీరింగ్ కళాశాలలు మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,ఐ టి శాఖ మంత్రి శ్రీధర్ బాబు లకు రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. లా, ఇంజనీరింగ్ కళాశాలలు మంజూరుకావడం పట్ల ఉమ్మడి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఏఐఎస్‌ఎఎఫ్ పోరాట ఫలితంగానే..

శాతవాహన యూనివర్సిటీకి అనుబంధంగా ప్రభుత్వ ఇంజనీరింగ్, లా కళాశాల ఏర్పాటు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ చేసిన పోరాట ఫలితంగానే యూనివర్సిటీకి ఇంజనీరింగ్, లా కళాశాలలు మంజూరయ్యాయి. జీవో విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్నాం. కళాశాల ఏర్పాటుకు కృషి చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబులకు ధన్యవాదాలు.

ఇంజనీరింగ్ కళాశాల యూనివర్సిటీ ఆవరణలో కరీంనగర్ కేంద్రంగా ఏర్పాటు చేయాలి. జిల్లాలో ఇప్పటికే ఆరు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వం జనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తేన్నత విద్య మరింత అందుబాటులోకి వస్తుంది. పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో జేఎన్టీయూ కళాశాలలు ఉన్నాయి. కరీంనగర్ కేంద్రంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తే ఉత్తర తెలంగాణకు విద్య హబ్ కరీంనగర్ మారుతుంది.

ఏఐఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల సిద్ధిపేటలో ఏర్పాటు చేయడం శోచనీయం

శాతవాహన యూనివర్సిటీకి మంజూరు చేసిన ఇంజనీరింగ్ కళాశాలను సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు జీవో విడుదల చేయడం శోచనీయం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న శాతవాహన యూనివర్సిటీలో కాకుండా జిల్లా హెడ్ క్వార్టర్ ను కించపరిచేవిధంగా, ప్రజలు, విద్యార్థుల మనోభావాలు కించపరిచేవిధంగా ఇంజనీరింగ్ కళాశాలను సిద్ధిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం దారుణమైన చర్య.

కరీంనగర్ జిల్లా కేంద్రం విద్యార్థులను అనువుగా, వెసులుబాటు, సౌకర్యంగా నప్పటికీ హుస్నాబాద్ లో ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో ఎంతోమంది విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నగర అభివృద్ధికి వ్యతిరేకమైన కార్యక్రమాలు మానుకోవాలి.

కరీంనగర్ నగరంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా కరీంనగర్ నగరాన్ని విస్మరించి ఈ ప్రాంతానికి నష్టం జరిగే కార్యక్రమాలు చేపట్టవద్దు. ఇంజనీరింగ్ కళాశాల తరలింపు విషయంలో మంత్రి శ్రీధర్ బాబు పునరాలోచన చేసి యూనివర్సిటీ ఆవరణలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి.

 మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు