calender_icon.png 22 February, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టం?

16-02-2025 12:36:15 AM

  • మహా ప్రభుత్వం కీలక నిర్ణయం 

అధ్యయనానికి కమిటీ ఏర్పాటు

ముంబై, ఫిబ్రవరి 15: బలవంతపు మత మార్పిడి, లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టా న్ని తెచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం యో చిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే చ ట్టానికి సంబంధించిన చట్టపరమైన అంశాలను పరిశీలించడానికి రాష్ట్ర డీజీపీ సంజయ్ వర్మ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.

బలవంతపు మత మార్పిడులు, లవ్ జిహాద్‌కు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి కావాల్సిన చర్యలను ఈ కమిటీ సూచిస్తుందని శుక్రవా రం విడుదల చేసిన ఓ ప్రకటనలో ప్రభుత్వం వెల్లడించింది. అలాగే ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న చట్టాలను సమీక్షించడం తోపా టు చట్టపరమైన నిబంధనలను సిఫార్సు చే స్తుందని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

ప్ర భుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో డీజీపీతోపాటు మహిళా శిశు సంక్షేమశాఖ, మైనా ర్టీ వ్యవహారాలు, హోంశాఖ వంటి కీలక విభాగాలకు చెందిన సీనియర్ అధికారులకు చోటు కల్పించింది. 2022లో శ్రద్ధా వాకర్ కేసు తర్వాత బీజేపీ నేతృత్వంలోని కూటమి లవ్ జిహాద్ అంశాన్ని లేవనెత్తిన విషయం తెలిసిందే.

అసలైన సమస్యలపై దృష్టిపెట్టండి

కమిటీ ఏర్పాటుపై ఎన్సీపీ(ఎస్పీ) సుప్రి యా సులే అసహనం వ్యక్తం చేశారు. పెళ్లి, ప్రేమ విషయాలు వ్యక్తిగతమని పేర్కొన్నా రు. ప్రభుత్వం వాస్తవ సమస్యలపై దృష్టి పె ట్టాలని సూచించారు. అమెరికా సుంకాలు దేశంపై ప్రభావితం చూపుతాయని ఈ క్ర మంలో ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

బీజేపీ కేవలం ముస్లింలను వేధించడం, మతతత్వాన్ని వ్యా ప్తి చేయడంపై మాత్రమే దృష్టి పెట్టిందని స మాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ ఆజ్మీ ఆ రోపించారు. అయితే ప్రతిపక్షాల విమర్శల ను బీజేపీ ఎమ్మెల్యే మంగళ్ లోధా ఖండించారు.

శ్రద్ధా వాకర్ శరీరాన్ని ఎన్ని ము క్కు లుగా నరికారో రాష్ట్ర మొత్తం చూసిందన్నా రు. అలాంటి కేసులు రాష్ట్రంలో చాలా  ఉ న్నాయన్నారు. తాము లవ్ జిహాద్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే.. ప్రతిపక్షాలకు అది మింగుడుపడటం లేదని విమర్శించారు.