calender_icon.png 11 January, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లావణ్యను వరించిన ఉత్తమ మహిళ పురస్కార్ అవార్డు

04-01-2025 11:16:47 PM

మందమర్రి,(విజయక్రాంతి): సావిత్రి బాయి పూలే జయంతి ఉత్సవాల(Savitribai Phule Jayanthi Utsav) సందర్భంగా  రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలను గుర్తించి ఉత్తమ మహిళా పురస్కార్ అవార్డు అందించింది. ఈ మేరకు పట్టణంలోని నాగార్జున కాలనీకి చెందిన కనకం లావణ్య కు ఉత్తమ మహిళా పురస్కార్ అవార్డు వరించింది. క్రీడల్లో రాణిస్తూనే, ఆధ్యాత్మిక రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తున్నందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దేశంలోనే తొలి ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే జయంతి(Savitribai Phule Jayanthi)ని పురస్కరించుకుని లావణ్యకు ఉత్తమ మహిళ పురస్కార్ అవార్డ్(Best Woman Award)ను అందచేసింది.

హైదరాబాద్ రవీంద్రభారతిలో శుక్రవారం తెలంగాణ  ప్రభుత్వం నిర్వహించిన సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలలో రాష్ట్రంలో పలు రంగాల్లో ప్రతిభావంతులను, విశిష్టమైన సేవలందిస్తున్న మహిళలను గుర్తించి ఉత్తమ మహిళ పురస్కార్ అవార్డులకు ఎంపిక చేసి, ఎంపికైన మహిళలకు అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అవార్డుకి ఎంపికైన  లావణ్యను జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షురాలు మణి మంజరి చేతుల మీదుగా ఉత్తమ మహిళ పురస్కార్ అవార్డును అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా అవార్డు గ్రహీత లావణ్య మాట్లాడుతూ ఉత్తమ మహిళా పురస్కార్ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు,క్రీడా,ఆధ్యాత్మిక రంగాల్లో అందించిన సేవలను గుర్తించి అవార్డు అందించినందుకు రాష్ట్ర  ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అవార్డు రావడానికి  కృషి చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా పట్టణానికి చెందిన చెందిన లావణ్యకు ఉత్తమ మహిళా పురస్కార్ అవార్డు రావడం పట్ల కాలనీ వాసులు, పట్టణ ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు.