calender_icon.png 24 February, 2025 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న సతీ లీలావతి

21-02-2025 12:00:00 AM

వైవిధ్యమైన పాత్రలతో కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు లావణ్య త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో మరో చిత్రం తెరకెక్కుతోంది. అదే ‘సతీ లీలావతి’. మలయాళ నటుడు దేవ్ మోహన్ కూడా ఇందులో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకు ‘భీమిలీ కబడ్డీ జట్టు’, ‘ఎస్‌ఎంఎస్: శివ మనసులో శ్రుతి’ ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు.

ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాలపై ఈ చిత్రాన్ని నాగమోహన్‌బాబు ఎం, రాజేశ్ టీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా.. మూవీ టీమ్ ప్రస్తు తం చిత్రీకరణను పరుగులు పెట్టిస్తోంది. ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేశామంటూ తాజాగా చిత్రబృం దం ప్రకటించింది. హైదరాబాద్‌లోనే జరిగిన తొలి షెడ్యూల్‌లో హీరోహీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

ఇక నిర్విరామంగా చిత్రీకరణ నిర్వహించి, వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నారు దర్శకనిర్మాతలు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బినేంద్ర మీనన్; సంగీతం: మిక్కీ జే మేయర్; మాటలు: ఉదయ్ పొట్టిపాడు; ఆర్ట్: కోసనం విఠల్; ఎడిటర్: సతీశ్ సూర్య.