calender_icon.png 10 January, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దౌల్తాబాద్, రాయపోల్ మండలాల బీజేపీ అధ్యక్షులుగా దేవుడి లావణ్య, మంకిడి స్వామి

10-01-2025 12:14:39 PM

దౌల్తాబాద్,(విజయక్రాంతి):  దౌల్తాబాద్, రాయపోల్ మండలాలకు బిజెపి నూతన అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. దౌల్తాబాద్ బీజేపీ పార్టీ మండల అధ్యక్షులుగా దేవుడి లావణ్య నరసింహారెడ్డి, రాయపోల్ బీజేపీ పార్టీ మండల అధ్యక్షులుగా మంకిడి స్వామి నియామకమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బీజేపీ దౌల్తాబాద్, రాయపోల్ మండలాల నూతన అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగుల, అలాగే  సహకరించిన మండలాల నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. తామపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తామన్నారు. దౌల్తాబాద్, రాయపోల్ మండలాలలో ప్రతి గ్రామంలో బూత్ కమిటీలను మండల నాయకులను మమేకం చేసుకుంటూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పార్టీ కార్యక్రమాలను పార్టీ ఆదేశించిన బాధ్యతలను శిరసావహిస్థామని పేర్కొన్నారు.