హైదరాబాద్: నార్సింగి పోలీస్ స్టేషన్ లో నటుడు రాజ్ తరుణ్ పై కేసు నమోదైంది. ప్రేమించి మోసం చేశాడని ఇటీవల లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ పై సెక్షన్ 420,506, 493 కింద కేసు నమోదు చేశారు.
మంగళవారం రాత్రి నార్సింగి పీఎస్ లో లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు. రాజ్ తరుణ్ తో తనకు పదేళ్ల క్రితమే వివాహమైందని, పదేళ్లుగా తాను, రాజ్ తరుణ్ కాపురం చేస్తున్నామని వెల్లడించింది. తనను రెచ్చగొట్టి.. ఉద్దేశపూర్వకంగా తన ఆడియోలు రికార్డ్ చేశాడని లావణ్య ఆరోపిస్తోంది. కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని లావణ్య ఆరోపించింది. రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడని కొన్ని పత్రాలను, ఫొటోలు, టెక్నికల్ ఎవిడెన్స్ ను పోలీసులకు అందించింది. రాజ్ తరుణ్, తాను విదేశాలకు కూడా వెళ్లామని లావణ్య తెలిపింది. రాజ్ తరుణ్ ఇటీవల ఓ నటితో సన్నిహితంగా ఉంటున్నాడని ఆమె ఆరోపిస్తోంది. మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని లావణ్య పోలీసులకు చెప్పింది.