calender_icon.png 6 February, 2025 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగ్న వీడియోల కేసు.. హార్డ్ డిస్క్‌ సమర్పించిన లావణ్య

06-02-2025 11:42:55 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): మస్తాన్‌ సాయి కేసులో రోజుకో ట్విస్ట్‌ వెలుగులోకి వస్తోంది. విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. మహిళల వ్యక్తిగత వీడియోలు సేకరించి, బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో మస్తాన్‌ను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నగ్న వీడియోల కేసులో నార్సింగి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. నగ్న వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ ను లావణ్య ఇప్పటికే పోలీసులకు సమర్పించింది. ఆ హార్డ్ డిస్క్ ను పోలీసులు ఎఫ్ఎస్ఎల్ కి పంపించారు. దీంతో బహిర్గతమైన డ్రగ్ పార్టీ వీడియోలపైనా ఆరా తీస్తున్న పోలీసులు వీడియోల్లో ఉన్నవారికి నోటీసులు ఇవ్వనున్నారు. నిందితుడు ముస్తాన్ సాయిని కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉనీత్ రెడ్డి అనే స్నేహితుడి ద్వారా మస్తాన్ సాయికి లావణ్యకు పరిచయం ఏర్పాడింది. 

ఓ ఫంక్షన్‌కు మస్తాన్‌ ఇంటికి వెళ్లిన లావణ్య దుస్తులు మార్చుకుంటున్న వీడియో తీసి తన స్నేహితులకు పంపాడు. విషయం తెలిసిన లావణ్య అతనితో గొడవకు దిగి రాజ్‌తరుణ్‌ వీడియోలను డిలీట్‌ చేయించారు. కానీ, అప్పటికే ఆ వీడియోలను మస్తాన్‌ మరో హార్డ్‌ డిస్క్‌లో భద్రపర్చాడు. ఆ డిస్క్‌ను 2024 నవంబరులో లావణ్య తన ఇంటికి తీసుకొచ్చింది. అప్పటి నుంచి మస్తాన్‌.. లావణ్యను చంపించేందుకు ప్రయత్నిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఇక, మస్తాన్ సాయి తన ఇంట్లో ప్రతి శని, ఆదివారాల్లో డ్రగ్స్ పార్టీలు ఏర్పాటు చేసి, డ్రగ్స్ తీసుకున్నవారిలో కొందరిని టార్గెట్ చేసుకునేవాడు. మత్తులోకి జారుకున్న అమ్మాయిలతో లైంగిక పాల్పడిన వీడియోలను రికార్డు చేసి హర్డ్ డిస్క్ లో భద్రపర్చుకున్నట్లు పోలీసుల విచారణలో తెలింది. అప్పుడు తీసిన వీడియోలతో బెదిరించి వారిని లోబర్చుకునేవాడని లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.