26-04-2025 06:47:04 PM
ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో గోడపత్రికల ఆవిష్కరణ..
ఇల్లెందు టౌన్ (విజయక్రాంతి): కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా 139వ మేడేను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కొక్కు సారంగపాణి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండి. రాసుద్దీన్, రాష్ట్ర నాయకులు తోడేటి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కొండపల్లి శ్రీనివాస్, ఏరియా కమిటీ అధ్యక్షులు డి. మోహన్ రావు పిలుపునిచ్చారు. శనివారం ఇల్లెందు సి హెచ్ పి లో రైల్వే కాంటాక్ట్ కార్మికులతో, మండల పరిధిలోని రొంపేడు చెక్పోస్ట్ సెంటర్లో సిమెంట్ బ్రిక్స్ కార్మికులతో మేడే పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడారు.
కార్మిక వర్గాన్ని కట్టు బానిసత్వానికి గురిచేసే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ బిజెపి సర్కార్ తెచ్చే లేబర్ కోడ్ ల రద్దుకై,సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని,ప్రభుత్వ రంగ పరిశ్రమల అమ్మకాన్ని ఆపాలని, కనీస వేతనం నెలకు 26వేలు ఇవ్వాలని, అసంఘటిత కార్మికులకు ఉద్యోగ భద్రత పిఎఫ్, ఇఎస్ఐ, పెన్షన్ తదితర చట్ట బద్ధ హక్కులు అమలు చేయాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, స్క్రీం వర్కర్లందర్నీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ 139వ మేడేను జరపాలని ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపునిచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఆదెర్ల అంజయ్య, నాయకులు మహేందర్, అజ్మీర గోపి, పోశం గాంధీ, రాములు, సిద్దు, అజ్మీర కిషన్, పోశం, శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు.