న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: ప్రస్తుత, ఔత్సాహిక ఎగుమతిదారులకు మార్గనిర్దేశం కోసం ఎగుమతులు, దిగుమతులకు సం బంధించిన సమగ్ర సమాచారాన్ని వెల్లడించే ట్రేడ్ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. ఆయా ఉత్పత్తుల అంతర్జాతీయ డిమాండ్, దేశాల వారీగా అందుకు సంబంధించిన వ్యాపార సమాచారం, అంతర్జాతీయ ప్రమాణాలు, మార్కెట్లను యాక్సెస్ చేసుకునే పరిస్థితు లు, పాటించాల్సిన నిబంధనలు, అంతర్జాతీయ కొనుగోలుదార్లతో సంబంధాలు నెలకొల్పుకోవడం తదితర అంశాలన్నీ తాజాగా ప్రారంభించిన ట్రేడ్ కనెక్ట్ ఈ ప్లాట్‌ఫామ్‌లో లభిస్తాయి.
స్వేచ్ఛా వాణి జ్య ఒప్పందాలకు సంబంధించిన సమాచారం, సింగిల్ లోకేషన్ ద్వారా తక్కువ టారీఫ్‌లు, సుంకాలతో ఎగుమతిదిగుమతులు జరుపుకునేందుకు సంబంధిత డాక్యుమెంట్లను పోర్టల్ అందిస్తుంది. వ్యాపార సంబంధిత అంశాలపై అధికారులు, నిపుణుల నుంచి సమాచారం పొందేందుకు ఎగుమతిదారులు ఈప్లాట్‌ఫామ్‌పై వారి ప్రశ్నలు అడగవచ్చు. ఎం ఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ, ఎగ్జిమ్ బ్యాంక్, టీసీఎస్, ఫైనాన్షియల్ సర్వీసుల శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ సంయుక్తం గా ఈ పోర్టల్‌ను రూపొందించాయి.