నాగల్ గిద్ధ, ఫిబ్రవరి 4 : నాఫెడ్ వారిచే మార్కపేడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాని నగల్ గిద్ద మండలంలోని సక్రు నాయక్ తండాలో మంగళవారం ఏడీఏ నూతన్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళరుల బారిన పడకుండ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర. 7550 రైతులకు నేరుగా కొనుగోలు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వీవో ప్రవీణ్ చారి, ఏఈఓ సంతోష్, నాగల్ గిద్ద మండల రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు నేనావత్ రాజు మాజీ సర్పంచ్ బస్వరాజ్ ,మనోహర్ పాటిల్ ,గణపతి నాయక్, కిషన్ నాయక్ పాల్గొన్నారు