calender_icon.png 15 October, 2024 | 6:52 PM

చెన్నై నుండి సౌత్ స్టార్ రైల్ ప్రారంభం...

15-10-2024 04:10:56 PM

ముషీరాబాద్ (విజయక్రాంతి): కర్ణాటక ఆలయాలను సందర్శించే సువర్ణ అవకాశం టూర్ టైమ్స్ కల్పిస్తుందని టూర్ టైమ్స్ ఏపీ, తెలంగాణ రీజినల్ డైరెక్టర్ రమేష్ అయ్యంగార్, సౌత్ స్టార్ రైల్ డైరెక్టర్ విగ్నేష్ వెల్లడించారు. ఇండియన్ రైల్వేస్, భారత్ గౌరవ్ రైలు పథకం కింద తొలిసారిగా ప్రైవేట్ సెక్టార్ చెందిన సౌత్ స్టార్ రైల్ డిసెంబర్ 5న చెన్నైలో ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సౌత్ స్టార్ రైల్ వాల్ పోస్టర్ ను వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ రైల్ లో 9 రోజుల వ్యవధిలో కర్ణాటకలోని అత్యంత ప్రముఖ దేవాలయాలు నవ బృందావనం, గోకర్ణ, మురుడేశ్వర్, కొల్లూరు, శృంగేరి, హొరనాడు, ధర్మస్థల, కుకి సుబ్రమణ్య, మైసూర్, శ్రీరంగపట్నం, మేల్కోటేలను సందర్శించవచ్చని అన్నారు. ప్రతి కోచ్‌కు సీసీటీవీ కెమెరాలు, టూర్ మేనేజర్, సెక్యూరిటీ గార్డ్స్ వంటి అనేక రకాల సౌకర్యాలు ఉన్నాయన్నారు. భోజన వసతి కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు.

ఏపీ, తెలంగాణలో ఈ ప్రత్యేక రైల్ గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, నల్గొండ, మిర్యాలగూడ, సికింద్రాబాద్‌లలో రైలు ఎక్కేందుకు వీలు కల్పిస్తున్నామని అన్నారు. ఈ యాత్రలో పాల్గొని గోకర్ణలోని నక్షత్రం, తిధీతో సంబంధం లేకుండా పిండ తర్పణం చేసి పూర్వీకుల ఆశీస్సులు పొందే అవకాశం ఉందన్నారు. సీనియర్ సిటిజన్లకు ఒక చక్కటి అవకాశం అని వీరికి సబ్సిడీ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రయాణం కోసం లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ)ని ఉపయోగించవచ్చన్నారు. రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. స్లీపర్ క్లాస్ రూ.27 వేలు, థర్డ్ ఏసీకి రూ.33 వేలు, థర్డ్ ఏసీ ప్రీమియం రూ.37 వేలు, సెకండ్ ఏసీకి రూ.40 వేలతో ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ఆసక్తి ఉన్న యాత్రికులు వెబ్ సైట్ www.traintour.in లేదా ఫోన్ : 9355021516 నెం.లో సంప్రదించవచ్చన్నారు.