calender_icon.png 25 December, 2024 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికవర్ ‘షీ క్లినిక్’ ప్రారంభం

04-08-2024 12:07:18 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు (విజయక్రాంతి): కార్పొరేట్ వర్కింగ్ ఉమెన్, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా.. ప్రతి శనివారం ఉచిత గైనకాలజిస్ట్ కన్సల్టేషన్, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్, 30 శాతం రాయితీతో ఆల్ ఇన్వెస్టిగేషన్స్, ఏడాదికి ఒకసారి కాంప్లిమెంటరీ హెల్త్ చెకప్ ప్యాకేజీని శనివారం మెడికవర్ ఉమన్ అండ్ చైల్డ్ ఆసుపత్రి ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హ్యాష్‌టాగ్ మార్కెటింగ్ వ్యవస్థాపకురాలు గుల్నార్ విర్క్ కృష్ణ హాజరై మాట్లాడుతూ.. ఒత్తిడి, సరైన లైఫ్ స్టుల్ లేకపోవడంతో పాటు ఇతర కారకాల ప్రభావంతో ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. వయస్సు, శారీరక వ్యాధులు, సమస్యలు, మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయని అన్నారు. ఆసుపత్రి బిజినెస్ ఆపరేషన్స్ చీఫ్ మహేష్, డాక్టర్ రవీందర్‌రెడ్డి, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.