నాగర్‌కర్నూల్, జూలై 9 (విజయక్రాంతి): కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదటి, రెండు, మూడో లిఫ్టు పంపుల ద్వారా కృష్ణానీటి ఎత్తిపోతల ప్రక్రియ ప్రారంభమైంది. నాలుగు రోజులుగా ఈ ప్రక్రియలను ప్రారంభించి మోటర్లను చెక్‌చేశారు. మంగళవారం నుంచి నిర్విరామంగా ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లను కృష్ణానీటితో నింపుతున్నారు. కృష్ణానది వరద జలాలు ప్రారం భమవుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మోటర్లను ప్రారంభించినట్టు డీఈ చందునాయక్ తెలిపారు.