హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 18 (విజయక్రాంతి): నగరంలోని గచ్చిబౌలిలో ఇండి యన్ బ్యాంక్ రిటైల్ అసెట్స్ ప్రాసెసింగ్ సెం టర్ (ఆర్‌ఏపీసీ) 2ను ఫీల్డ్ జనరల్ మేనేజర్ జీ రాజేశ్వరరెడ్డి, జోనల్ మేనేజర్ సోమేపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంకుకు చెందిన పలు వురు ముఖ్యమైన ఖాతాదారులు, నగరంలో ని ప్రముఖ రియల్టర్లు, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంక్ ఎఫ్‌వై 2024 కోసం రూ.12.21లక్షల కోట్ల గ్లోబల్ బిజినెస్‌ను గత ఎఫ్‌వై 23 కంటే 12 శాతం వృద్ధితో నివేదించింది.
మరొక రిటైల్ ప్రాసెసింగ్ సెంటర్‌ను ప్రారంభించడం ద్వారా ఇండియన్ బ్యాంక్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలో హోమ్ లోన్ మార్కెట్‌లోకి విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్‌లో ఆర్‌ఏపీసీ 2 ప్రారంభించిన సంద ర్భంగా గురువారం 100 మంది ఖాతాదారులకు రూ.49.30 కోట్ల విలువ గల గృహ, విద్య, వాహన రుణాలను మంజూరు చేసిన ట్లు హైదరాబాద్ జోనల్ మేనేజర్ సోమేపల్లి శ్రీనివాస్ తెలిపారు. రుణ అవసరాల కోసం పాత, కొత్త ఖాతాదారులు ఇండియన్ బ్యాంక్‌ను సంప్రదించగలరని కోరారు.