calender_icon.png 1 October, 2024 | 1:01 AM

ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభం

30-09-2024 01:23:51 AM

కరీనంగర్‌లో ప్రారంభించిన మంత్రి పొన్నం 

తెలంగాణలో తొలిసారిగా అందుబాటులోకి

కరీంనగర్, సెప్టెంబర్ 29 (విజయక్రాం తి): కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో ఆదివారం ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు.

అన ంతరం టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సంజయ్‌కుమార్, కరీంనగర్ మేయ ర్ సునీల్‌రావు, కలెక్టర్ పమేలా సత్పతి, ము న్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్‌తో కలిసి బస్సు లో ప్రయాణించారు. బస్సులోనే కరీంనగర్  డిపోకు చేరుకుని అక్కడ ఎలక్ట్రిక్ బస్సు ల కోసం ఏర్పాటు చేసిన చార్జింగ్ స్టేషన్‌ను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి పొ న్నం మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే తొలిసారి గా ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను కరీంనగర్‌కు కేటాయించినందు కు ఆర్టీసీ యాజమాన్యానికి ధన్యవాదాలు తె లిపారు. ప్రస్తుతం కరీంనగర్ మార్గంలో తిరిగే 35 బస్సులు అం దుబాటులోకి వచ్చాయని, త్వరలోనే 39 ఎ లక్ట్రిక్ బస్సులను సంస్థ వాడకంలోకి తెస్తుందని తెలిపారు.

నిజామాబాద్‌కు 67, వరంగ ల్‌కు 86, సూర్యాపేటకు 52, నల్లగొండకు 6 5, హైదరాబాద్‌కు 74 ఎలక్ట్రిక్ బస్సులు అం దుబాటులోకి వస్తాయని వెల్లడించారు. మ హిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కే టాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆ మేరకు మెప్మాతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.

టీజీఎస్‌ఆర్‌టీసీ ఎం డీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. అత్యాధునిక హంగులతో అందుబాటులోకి తీసుకువస్తు న్న ఈ బస్సులు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగిస్తాయ ని అన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి జి ల్లాల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులను సంస్థ అం దుబాటులోకి తీసుకువస్తోందని తెలిపారు. బస్సులను త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేసిన జేబీఎం సంస్థను అభినందించారు. 

లగ్జరీ బస్సు ప్రత్యేకతలివే!

12 మీటర్ల పొడవు గల ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులో 41 సీట్లు ఉన్నాయి. మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంది. 4 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదాలు ముందుగానే గుర్తించి నివారించేందుకు ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టంను ఏర్పాటు చేశారు. బస్సుకు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించచ్చు.