calender_icon.png 4 November, 2024 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ

03-11-2024 01:14:50 AM

  1. తొలి రోజు  సుమారు 100 మంది ప్రయాణం
  2. పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1,600లు

* నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం శనివారం ప్రారంభమైంది. పర్యాటకశాఖ అధికారులతో కలిసి నందికొండ మున్సిపల్ చైర్‌పర్సన్ అన్నపూర్ణ జెండా ఊపి లాంచీని ప్రారంభించారు. తొలిరోజు సుమారు 100 మంది ప్రయాణికులు లాంచీలో శ్రీశైలం వెళ్లారు.

ఒకవైపు ప్రయాణానికి పెద్దలకు రూ. 2 వేలు, చిన్నారులకు రూ.1,600 చొప్పున పర్యాటకశాఖ టికెట్ ధర నిర్ణయించింది. అప్ అండ్ డౌన్ అయితే పెద్దలకు రూ. 3 వేలు, చిన్నారులకు రూ. 2,400 చెల్లించాల్సి ఉంటుంది.    

నల్లగొండ, నవంబర్ 2 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నుంచి ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం శనివారం ప్రారంభమైంది. పర్యాటకశాఖ అధికారులతో కలిసి నందికొండ మున్సిపల్ చైర్‌పర్సన్ అన్నపూర్ణ జెండా ఊపి లాంచీని ప్రారంభించారు. తొలిరోజు సుమారు 100 మంది ప్రయాణికులు లాంచీలో శ్రీశైలం వెళ్లారు.

సాగర్ నుంచి శ్రీశైలానికి నదీమార్గంలో 6 గంటలకుపైగా సమయం పడుతుంది. ప్రకృతి అందాల నడుమ ఈ యాత్ర సాగనుంది. అరుదైన వృక్షాలు, జంతువులు, కృష్ణా నదిలోకి జాలువారుతున్న సుందర జలపాతాలు, ఎత్తున కొండలు, అక్కడక్కడ కనిపించే చెంచుగూడేలను పర్యాటకులు తిలకించే వీలుంది.

ఒకవైపు ప్రయాణానికి పెద్దలకు రూ. 2 వేలు, చిన్నారులకు రూ.1,600 చొప్పున పర్యాటకశాఖ టికెట్ ధర నిర్ణయించింది. అప్ అండ్ డౌన్ అయితే పెద్దలకు రూ. 3 వేలు, చిన్నారులకు రూ. 2,400 చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటలకు లాంచీ సాగర్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3 గంటలకు శ్రీశైలం చేరుకుంటుంది.

మరుసటి రోజు ఉదయం 9 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3 గంటలకు సాగర్‌కు వస్తుంది. ఈ ప్రయాణంలో ఒకసారి ప్రయాణికులకు భోజనం అందిస్తారు. వాతావరణ పరిస్థితికి అనుగుణంగా లాంచీలను నడుపుతామని, 40 మందికిపైగా ప్రయాణికులు టికెట్లను బుక్ చేసుకుంటే రెండ్రోజులకు ఒకసారి లాంచీని నడుపనున్నట్లు పర్యాటకశాఖ అధికారులు వెల్లడించారు.