03-03-2025 12:52:50 AM
త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా మల్లి యేలూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ థ్రిల్లర్ చిత్రం ‘జిగేల్’. ఈ సినిమాను డాక్టర్ వై జగన్‌మోహన్, నాగార్జున అల్లం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్, సాంగ్స్ విడుదలయ్యాయి. తాజాగా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో త్రిగుణ్, మేఘాచౌదరి ప్రేమకథ అద్భుంగా ఉంది.
ఇందులో ఇంకా షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, పృథ్వీరాజ్, మధు నందన్, ముక్కు అవినాష్ పాత్రలు కామెడీతో గిలిగింతలు పెట్టారు. లాకర్ చుట్టూ వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. మార్చి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి డీవోపీ: వాసు; మాటలు: రమేశ్ చెప్పాల, నాగార్జున అల్లం; సంగీతం: ఆనంద్ మంత్ర.