calender_icon.png 20 October, 2024 | 5:13 AM

హిందూ సంఘాలపై లాఠీచార్జి

20-10-2024 02:14:20 AM

సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత

  1. ముత్యాలమ్మ విగ్రహంపై దాడి ఘటనకు నిరసన
  2. బంద్ పాటించిన వాణిజ్య సంస్థలు
  3. వీహెచ్‌పీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ 
  4. అడ్డుకున్న పోలీసులతో ఆందోళనకారుల వాగ్వాదం 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19 (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లో వీహెచ్‌పీ, హిందూ సంఘాలు తలపెట్టిన బంద్, నిరసన ర్యాలీ శనివారం ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఫలితంగా ఆందోళనకారులు పోలీసులపై చెప్పులు, వాటర్ బాటిళ్లు విసరడంతో పోలీసులు ఒక్కసారిగా లాఠీచార్జీకి దిగారు. వందలాది మంది నిరసనకారులకు పోలీసుల లాఠీ దెబ్బలు తగిలాయి. కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంలో సోమవారం అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయటాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు శనివారం సికింద్రాబాద్ బంద్‌కు పిలుపునిచ్చాయి.

ఈ బంద్‌కు సహకరించాలంటూ హిందూ సంఘాలు విస్తృతంగా ప్రచారం చేపట్టాయి. దీంతో సికింద్రాబాద్ వ్యాప్తంగా శనివారం అనేక వాణిజ్య సంస్థలు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. సికింద్రాబాద్‌లోని హోటల్స్, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి.

సికింద్రాబాద్, సీతాఫల్‌మండి, అడ్డగుట్ట, మారేడ్‌పల్లి, బేగంపేట, రాణిగంజ్ రహదారులలోని దుకాణాలన్నీ మూసివేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నున్న ప్రధాన హోటల్స్ ప్యారడైజ్, అల్ఫా, కామత్, తాజ్‌మహల్ హోటల్స్ బంద్ పాటించాయి. ఈ బంద్‌లో బీజేపీ పార్టీ, బీజేపీ అనుబంధ సంఘాలతోపాటు టీడీపీ, జనసేన, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి దేవాలయం నుంచి కుమ్మరివాడ ముత్యాలమ్మ దేవాలయం వద్దకు హిందూ సం ఘాలు ర్యాలీగా వచ్చిన తర్వాత పోలీసులు, ఆందోళనకారుల మధ్య చోటుచేసుకున్న వివాదంలో నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా నిరసనకారులపై లాఠీచార్జి చేశారు. దీంతో ఆందోళనకారులు చెల్లాచెదురయ్యా రు.

ఈ సమయంలో సికింద్రాబాద్ ప్రాంత ంలో ఇంటర్నెట్ సేవలను బంద్ చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. అంతకంటే ముం దుగా బీజేపి నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తన నివాసం షామీర్‌పేట నుంచి సికింద్రాబాద్ ర్యాలీకీ బయలుదేరేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

అయితే, ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనంతనం ఈటల రాజేందర్ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి టెంపుల్ నుంచి కుమ్మరివాడ ముత్యాలమ్మ టెంపుల్ దాకా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మ ల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్, బీజేపీ, వీహెచ్‌పీ తదితర హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

మూల్యం చెల్లించాల్సి వస్తుంది: ఎంపీ ఈటల

సికింద్రాబాద్ కుమ్మరివాడ ముత్యాలమ్మ దేవాలయం వద్ద హిందూ భక్తులపై పోలీసులు లాఠీఛార్జి చేయడా న్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. అమ్మవారిని కాళ్లతో తన్ని అవమా నించిన వ్యక్తి వెనుక ఉన్నది ఎవరో ఇప్పటి దాకా ప్రకటించని ప్రభుత్వం హిందువుల త లలు పగిలేలా దాడి చేయించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.

సికింద్రాబాద్ మె ట్రోపోలీస్ హోటల్‌లో మత విద్వేషాలు రెచ్చ గొట్టేందుకు సమావేశం నిర్వహించినా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నిం చారు. రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరికి లుంబినీ పార్కు, గోకుల్ చాట్, దిల్‌సుఖ్‌నగర్ బాం బు పేలుళ్లలో తెగిపడ్డ మాంసపు ముద్దలు గుర్తుకొస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

మీ చిల్లర రాజకీయాల కోసం తాత్సారం చేస్తే.. బలయ్యేది అమాయక ప్రజలేనని, రాష్ట్ర ప్రభుత్వమే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఒక్క పిలుపుతో వేలాది మంది తర లివచ్చారంటేనే హిందూవులు ఎంత రగిలిపోతున్నారో, ఎంత అభద్రతా భావానికి గురవుతున్నారో ఈ ర్యాలీనే ఉదాహరణ అని అన్నారు.

ప్రభుత్వం ఇకనైనా తక్షణమే స్పందించి మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వచ్చిన ముఠా వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడు మాత్రమే హిం దూవుల ఆగ్రహావేశాలు చల్లారుతాయని అన్నారు. పోలీసుల అత్యాత్సుహంతో లాఠీఛార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ తెలిపారు.