02-04-2025 04:34:34 PM
టేకులపల్లి (విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూములు అన్యక్రాంతమవ్వకుండా కాపాడుకుందామని, బడా కార్పొరేట్ శక్తులకు HCU భూముల వేలం వెయ్యడాన్ని విరమించుకోవాలని, విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ టేకులపల్లి మండల కేంద్రంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ పూలే మార్క్స్ కాన్సిరాం ఆశయాల వేదిక రాష్ట్ర అధ్యక్షులు మెంతెన ప్రభాకర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ (TPF) ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి యెట్టి ప్రశాంత్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... "తెలంగాణ రాష్ట్రంలో" మా భూములు మాకే సొంతమని నినదిస్తు" తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్యక్రంతంవుతుంటే వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమాలు చేస్తుంటే పోలీసులతో వారిపై లాఠీలతో దాడి చేస్తూ, అక్రమ అరెస్ట్ లు చేసి, భయపెట్టిస్తూ ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికైనా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు పరిరక్షించాలని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తెలంగాణ ఉద్యమ తరహాలో తెలంగాణ రాష్ట్రంలో గల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసమై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, గ్రామాన ఉద్యమాలకు పిలిపిస్తామని ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరిస్తున్నాం.
ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అరెస్టు చేసిన విద్యార్థినీ, విద్యార్థులను విడుదల చేయాలని, వారిపై అక్రమంగా కేసులు బనాయించిన కేసులను వెనక్కి తీసుకోవాలని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల పరిరక్షణ కోసమై గ్రామస్థాయి నుండి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ జిల్లా సహాయ కార్యదర్శి మెంతెన కొండలరావు తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా నాయకులు బాణోత్ లాక్పతి అంబేద్కర్ పూలే యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మేకల సతీష్, పుంజా రాఘవులు, కీసరి నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.