నిర్మల్ (విజయక్రాంతి): పోలీస్ శాఖ అత్యవసర సర్వీసులకు వినియోగిస్తున్న 100 కాల్ కు స్పందించిన పోలీస్ సిబ్బంది అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంటున్న బక్కన్న ప్రాణాలను కాపాడారు. ఖానాపూర్ మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన బక్కన్న కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకుంటారని ఆదివారం రాత్రి ఇంటి నుండి వెళ్లిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు 100 నెంబర్ కు ఫోన్ చేయగా బ్లూ కోర్టు సిబ్బంది సుదీర్ సంతోష్ బక్కన్న ఫోన్ సిగ్నల్ ఆధారంగా అర్ధరాత్రి 11:30 నిమిషాలకు పెంబి మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించి అక్కడికి వెళ్లి బక్కన్నను కాపాడినట్లు పోలీస్ సిబ్బంది తెలిపారు. వ్యక్తి ప్రాణాలను కాపాడిన పోలీసులను జిల్లా ఎస్పీ జానకి షర్మిల(SP Janaki Sharmila) అభినందించారు.