calender_icon.png 23 February, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గతేడాది నాకు చాలా స్పెషల్

19-02-2025 12:00:00 AM

హీరోయిన్ మీనాక్షి చౌదరి 2024కు ముందు కొన్ని సినిమాలు చేసింది కానీ ఎందుకో అమ్మడికి ఆశించినంత గుర్తింపు రాలేదు. ఆ ఇయర్ ఎండింగ్ మాత్రం ఈ ముద్దుగుమ్మకు బాగా కలిసొచ్చింది. వరుస సినిమాలు విడుదలవడం.. అవన్నీ మంచి సక్సెస్ సాధించడంతో ఒక్కసారిగా బ్యూటీని స్టార్‌డమ్ వరించింది.

ఈ విషయమై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి స్పందించింది. గత ఏడాది తనకెంతో ప్రత్యేమని చెప్పుకొచ్చింది. కెరీర్ తొలినాళ్లలోనే తనకు విభిన్నమైన దర్శకులతో పని చేసే అవకాశం లభించిందని వెల్లడించింది. ఈ ఏడాది కూడా ఆరంభమే ఈ భామకు మంచి సక్సెస్ ఇచ్చింది.

గత ఏడాది చివరిలో ‘లక్కీ భాస్కర్’ చిత్రం తో పెద్ద హిట్ కొట్టిన మీనాక్షి ఈ సినిమా తో వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ ఏడాది ఆరంభంలోనూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది.

ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసి రూ.300 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ యమా యాక్టివ్. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఒకవైపు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటూనే మరోవైపు దర్శక నిర్మాతల ఫోకస్‌లో ఉండేందుకు యత్నిస్తోంది మీనాక్షి చౌదరి.