calender_icon.png 17 January, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్ము ఉగ్రదాడుల వెనుక లష్కరే హస్తం

08-07-2024 01:14:08 AM

ఎదురు కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం

న్యూఢిల్లీ, జూలై 7: జమ్మూకశ్మీర్ ఉగ్రదాడుల వెనుక లష్కరే తోయిబా టెర్రరిస్ట్ గ్రూప్ టాప్ కమాండర్ హస్తం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సైఫుల్లా సాజిద్ జాట్ అనే వ్యక్తి పాకిస్తాన్‌లోని పంజాబ్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతడు హార్డ్ కోర్ టెర్రరిస్ట్. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఇతడి తల మీద రూ. 10 లక్షల రివార్డును కూడా ప్రకటించేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... జాట్ పాక్ రాజధాని ఇస్లామాబాద్ నుంచి బేస్ క్యాంప్ నడుపుతూ కశ్మీర్‌లో దాడులు చేయిస్తున్నాడు.

ఇతడి భార్య మాత్రం ఇండియన్ మూలాలున్న వ్యక్తి. ఆమె కూడా అతడితోనే ఉంటుంది. అతడు ఇంతకు ముందు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పనిచేసినట్లు.. ఇప్పుడు మాత్రం లష్కరే రిక్రూ ట్‌మెంట్ ఏజెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడట. ఇండియాలో నరమేధం సృష్టిస్తున్న టెర్ర రిస్టులను తయారు చేస్తూ వారికి సహాయం చేస్తున్నాడు. అతడు లష్కర్‌లో ఆపరేటర్ కమాండర్‌గా విధులు నిర్వర్తిస్తూ.. టెర్రర్ ఫండింగ్ కూడా చూసుకుంటున్నాడట. 

ఎన్‌ఐఏకి మోస్ట్ వాంటెడ్

సాజిద్ జాట్ ఎన్‌ఐఏకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతడు జమ్మూలో ఉంటున్న ఖాసింను సంప్రదించినట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. లోయలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న టెర్రరిస్ట్ దాడుల వెనుక జాట్ ఉన్నట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. 

జమ్ములో మరోమారు పేలిన తుపాకీ.. 

జమ్మూకశ్మీర్‌లో మరోమారు తుపాకుల మోత మోగింది. శనివారం కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వివిధ ఘటనల్లో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.