calender_icon.png 16 November, 2024 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి నుంచి లష్కర్ బోనాలు

20-07-2024 03:30:54 AM

  • జాతర కోసం విస్తృత ఏర్పాట్లు 
  • హాజరుకానున్న సీఎం, మంత్రులు 
  • గవర్నర్ హాజరయ్యే అవకాశం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 19 (విజయక్రాంతి): ఆషాఢ మాసం సందర్భంగా జరిగే చారిత్రక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి (లష్కర్) బోనాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రారంభమ య్యే తొలిపూజ, మహా హారతితో బోనాలు ప్రారంభం కానున్నాయి. ఆదివారం, సోమవారం జరగబోయే ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భక్తు ల కోసం దేవాదాయ శాఖ, జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నార్త్‌జోన్ డీసీపీ రష్మీపెరుమాళ్ ఆధ్వర్యంలో 1500 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు. ఉత్సవాల సందర్భంగా నగరంలోని 24 ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా 175 బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోనల్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. 

మంగళవారం రంగం..

రంగం సందర్భంగా మంగళవారం ఉద యం 8.30 గంటల సమయంలో మాతంగి స్వర్ణలత కుండపై నిలబడి భవిష్యవాణి చెబుతారు.  రాష్ట్రంలో వ్యవసాయం, వర్షాపాతం, వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయాల గురించి జోస్యం చెబుతారు. అనంతరం సాయంత్రం అంబరి ఊరేగింపు జరుగుతుంది.   ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం రాలేని వృద్ధులు, వికలాంగుల కోసం అంబరి ముందు ఘటాలను ఉంచుతారు. ఆలయం చుట్టూ ఘటం, అంబరి ప్రదర్శన చేసిన అనంతరం ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పోతరాజుల విన్యాసాలు, గొర్రె పొటేళ్లతో ఫలారం బండ్ల ఊరేగింపు కూడా జరుగుతుంది. 

జోగినీలు, శివసత్తుల కోసం ఏర్పాట్లు 

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల సందర్భంగా జోగినీలు, శివసత్తుల కోసం దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బల్కంపేట బోనాల సందర్భంగా జోగినీలు, శివసత్తులకు ఇబ్బందులు కలిగినట్లు అధికారుల దృష్టికి రావడంతో గురువారం వారితో దేవాదాయ శాఖ ప్రధా న కార్యదర్శి శైలజారామయ్యర్ సహా జిల్లా అధికారులు చర్చించారు. వారి కోసం గతం లో ఈ ఆలయ ఈవోగా పనిచేసిన అన్నపూర్ణను నాలుగు రోజుల పాటు ప్రత్యేక అధికా రిగా  నియమించారు.  

పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం.. 

సీఎం రేవంత్‌రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మం త్రి కొండా సురేఖ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ శాంతకుమారి సహా పలువురు మంత్రులు హాజరు కానున్నా రు. శుక్రవారం దేవాదాయ శాఖ అధికారులు సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసి ఉత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రికను అందించారు. గవర్నర్ రాధాకృష్ణన్ హాజరయ్యే అవకాశం ఉంది.

రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు దాదాపు 35 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. బోనాల సందర్భంగా మొదటి రోజు మనో టాకీస్ దగ్గర ఉన్న అక్కన్న మాదన్న దేవాలయం నుంచి పచ్చికుండను, మోండా మార్కెట్ నుంచి జల కడువ, వివిధ ప్రాంతాల నుం చి వెయ్యికండ్ల కుండ, అమ్మవారి గాజులను తీసుకురావడం తదితర కార్యక్రమా లు జరుగుతాయి.