25-02-2025 02:40:01 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): లాసెట్, పీజీఎల్ సెట్‌లకు మంగ ళవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 1 నుంచి ప్రారంభం కాను న్న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఏప్రిల్ 15 వరకు కొనసాగనుంది. ఏప్రిల్ 25 వరకు రూ. 500 జరిమానాతో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 5 వరకు రూ.వెయ్యి జరిమానా తో, మే 15 వరకు రూ. 2 వేలతో, మే 25 వరకు రూ. 4వేలతో దరఖాస్తులు స్వీకరించనున్నారు..
మే 20 నుంచి మే 25 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులను సవరణ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. మే 30న హాల్ టికెట్లు విడుదల కానుండగా.. జూన్ 6న లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఉదయం మూడేళ్ల లా కోర్సుకు లాసెట్.. మధ్యాహ్నం ఐదేళ్ల లా కోర్సుతో పాటు పీజీఎల్ సెట్ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 10 న ప్రాథమిక కీ, 14 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. జూన్ 25న ఫైనల్ కీ తో పాటు ఫలితాలు విడుదల చేసేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తులు చేయనుంది.
మే 12న ఈసెట్ పరీక్ష
ఈసెట్‌కు సంబంధించి కూడా నోటిఫికేషన్ మంగళవారమే విడుదల కానుంది. మార్చి 3 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుం డగా.. ఏప్రిల్ 19 వరకు స్వీకరించనున్నారు. మే12 న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈసెట్ పరీక్ష జరగనుంది.