calender_icon.png 19 April, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

600 టన్నుల ఐఫోన్లు అమెరికాకు తరలింపు

11-04-2025 11:38:15 PM

ట్రంప్ సుంకాలు తప్పించుకునేందుకేనా!

భారత్ నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున ఐఫోన్ల ఎగుమతి

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల పుణ్యమా అని భారత్ అమెరికాకు ఐఫోన్ల ఎగుమతిని పెంచింది. ఏకంగా 600 టన్నుల ఐఫోన్లను విమానంలో అమెరికాకు తరలించింది. ట్రంప్ టారిఫ్‌లు అమల్లోకి వస్తే ఐఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున యూఎస్‌కు వీటిని తరలించింది. ఐఫోన్‌లు అమెరికాకు తరలించడానికి, చెన్నైలో కస్టమ్స్ క్లియర్ చేయడానికి అవసరమైన 30 గంటల సమయాన్ని 6 గంటలకు తగ్గించినట్టు తెలుస్తోంది.

దీనికోసం ‘గ్రీన్ కారిడార్’ ఏర్పాటు చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్చి నుంచి 100 టన్నుల సామర్థ్యం కలిగిన దాదాపు ఆరు కార్గో జెట్లు అమెరికాకు బయలుదేరాయి. వీటిలో ఒకటి సుంకాలు ప్రకటించిన ఈ వారంలో అమెరికా వెళ్లింది. కాగా చైనాపై అమెరికా 145 శాతం సుంకాలు విధించడంతో వీటి ధరలు పెరుగుతాయని విశ్లేషకులు హెచ్చరించారు. భారత్‌పై 26 శాతం సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. అయితే చైనా మినహా మిగిలిన అన్ని ప్రపంచ దేశాలకు అమెరికా మూడు నెలల వరకు సుంకాల విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.