10.300 కిలోల గంజాయి, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం ఇద్దరు అరెస్ట్
ఎస్సై సుభాష్ గౌడ్ ను అభినందించిన ఎస్పీ ఉదయ్ కుమార్
మనోహరాబాద్ (విజయక్రాంతి): గుట్టు చప్పుడు కాకుండా భారీ ఎత్తున గంజాయిని విక్రాయిస్తున్న స్మాగ్లర్లను పట్టుకునట్లు మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ వెల్లడించారు. తుప్రాన్ డిఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఉదయ్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనోహరబాద్ మండలం జీడిపల్లి గ్రామా చివరిలోని హైవ్ 44 జాతీయ రహదారి వద్ద ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రంజాన్ కుమార్ 30, బీహార్ చెందిన వ్యక్తి బ్లు కవర్ లో గంజాయి విక్రాయిస్తున్నట్లు నమ్మదగ్గా సమాచారం మేరకు మనోహరబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ అయన సిబ్బందితో కలిసి బుధవారం సంఘటన స్థలానికి చేరుకొని గంజాయి విక్రాయిస్తున్న రంజాన్ కుమార్ ను అదుపులోకి తీసుకొని వివరాలు ఆరా తీయగా ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో కిరాయికి ఉంటున్న శ్రీధర్ సాహు వద్ద కిలో గంజాయి కొనుగోలు చేసానని తెలపడంతో అయన ఇంటివద్ద వెళ్ళి చూడగా 9.300 కిలోల గంజాయి పట్టుబడిందని ఇరువురు వ్యక్తుల వద్ద 19.300. కిలోల గంజాయి, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోని గంజాయి విక్రయ దారులను అరెస్ట్ చేశామని సూచించారు. ఈ సందర్బంగా సిఐ రంగా కృష్ణ, మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్, పోలీస్ సిబ్బంది ప్రసాద్, అనిల్, శ్రీనివాస్ గౌడ్, బిక్షపతిలను ఎస్పీ ఉదయ్ కుమార్ అభినదించారు.