calender_icon.png 16 April, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన

16-04-2025 01:00:08 AM

ఎకరాకు రూ. 20 వేల పరిహారం ఇవ్వాలి

కల్లూరు, ఏప్రిల్ 15 :అకాల వర్షాలతో పంట నష్ట పోయిన రైతులను సత్వరమే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నే త్రుత్వంలోని బీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధి బృందం ప్రభుత్వాన్ని కోరింది.మంగళవారం కల్లూరు మండల పరిధిలోని పుల్లయ్య బంజర్, కిష్టయ్య బంజర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు సందర్శించి, రైతులతో కలిసి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, పరిహారం కోరుతూ కేంద్రాల వద్ద బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు.అకాల వర్షంతో తడిచి మొక్కలు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సండ్ర వెంకట వీరయ్య కోరారు.

పుల్లయ్య బంజర్ శివాలయం వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా బీఆర్‌ఎస్ నాయకులు సందర్శించి రైతులతో మాట్లాడారు.తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని,ఎకరానికి 20 వేల రూపాయల నష్టపరిహారం అందించాలని సండ్ర డిమాండ్ చేశారు.బస్తాలు ఇవ్వకపోవడం,ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయకపోవడం,మిలర్లను ఒప్పించటంలో విఫలం కా వటం తోనే నేడు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక్క పుల్లయ్య బంజర కొనుగోలు కేంద్రంలోనే లక్ష బస్తాల ధాన్యం వర్షానికి తడిచిపోయిందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమించి తడిచిన ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.కాళీ గన్ని సంచులను అధికారుల పర్యవేక్షణ లేకుండా, గ్రామాలలో గల కాంగ్రెస్ నాయకుల వద్ద ఉంచి వారికి ఇష్టమైన వారికి ఇస్తున్నారని, మండలంలో ఒక గ్రామంలో ఖాళీ సంచుల కోసం రెండు గ్రూపులు వారు అధికారుల ఎదుటనే ఘర్షణ పడ్డారని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాలెపు రామారావు,సత్తుపల్లి మునిసిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి. మహేష్,సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ బోగోలు లక్ష్మణరావు, మాజీ జడ్పిటిసి సభ్యులు కట్ట అజయ్ కుమార్, లక్కినేని రఘు, తల్లాడ బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రెడ్డం వీరమోహన్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి దుగ్గిదేవర వెంకటలాల్,మండల నాయకులు పెద్దబోయిన మల్లేశ్వరరావు, కాటంనేని వెంకటేశ్వరరావు, రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,పెడకంటి రామకృష్ణ, షేక్ కమ్లి, కొరకొప్పు ప్రసాద్, సీఎచ్ కిరణ్ కుమార్,

అజ్మీర జమలయ్య, ఖమ్మం పాటి రమేష్, వాసిన నారాయణరావు, గంగవరపు. శ్రీనివాసరావు, కళ్యాణపు కొండలరావు, నందిగాం ప్రసాద్, రాఘవులు, బానోత్ కృష్ణ, నేపాల్ కృష్ణ, బారిష్టర్, షరాబు వెంకటేశ్వరావు, వీరకృష్ణ, నాగయ్య, వీరయ్య, వెంకటేశ్వర్లు,పుల్లయ్య బంజర్, కిష్టయ్య బంజర్ గ్రామ రైతులు, మండల రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.