calender_icon.png 1 April, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ల్యాప్ టాప్స్ అందజేత

29-03-2025 10:53:09 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని సేవ భారతి ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర, బాలికల, గర్మిళ్ళ పాఠశాలలకు, శిశు మందిర్ పాఠశాలకు కార్పొరేట్ సంస్థల సహకారంతో ల్యాప్ టాప్స్ అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నైపుణ్య శిక్షణకు ఈ ల్యాప్ టాప్స్ అందించడం జరిగిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. త్వరలో మరిన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ ల్యాప్ టాప్స్ అందించి విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సేవా భారతి సంస్థ ప్రతినిధులు రఘునాథ్ వెరబెల్లి, చోలేటి హరీష్, కిషన్ శాస్త్రి, రజనీష్ జైన్, మల్రాజ్ ఆనంద్ రావు, రవి శేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.