calender_icon.png 6 April, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ల్యాప్‌టాప్‌ అందజేత

05-04-2025 05:50:32 PM

మంచిర్యాల (విజయక్రాంతి): ఫిబ్రవరి 3న నిర్వహించిన ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ పరీక్షలో శ్రీ చైతన్య మంచిర్యాల బ్రాంచ్ విద్యార్థులు రాణించి ల్యాప్‌టాప్‌ను కైవసం చేసుకున్నారు. 7వ తరగతి విద్యార్థి సంశ్రేయ పరీక్షలో అత్యుత్తమంగా రాణించి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా ల్యాప్‌టాప్ అందుకున్నారు. విద్యార్థిని శ్రీ చైతన్య స్కూల్స్ చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ విద్య, రాష్ట్ర సమన్వయకర్త జయరాజ్ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏజిఎం అరవింద్ రెడ్డి, కోఆర్డినేటర్ నాగరాజు, ప్రిన్సిపాల్ అయూబ్, డీన్ నాగేశ్వర్ రావు, ఐపిఎల్ ఇంచార్జ్ సుబ్బారెడ్డి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.