calender_icon.png 23 April, 2025 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్ద కోరుకోండి పాఠశాలకు ల్యాప్ టాప్ వితరణ

23-04-2025 01:56:21 PM

మధిర మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కట్టా వెంకట నరసయ్య జ్ఞాపకార్థంగా.

కల్లూరు,(విజయక్రాంతి): మండల పరిధిలో పెద్దకొరుకుండి(Peddakorukondi) గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలకు మధిర మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కట్టా వెంకట నరసయ్య జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు రూ 70 వేల విలువగల ల్యాప్ టాప్ ను వితరణ. బుధవారం పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిఆర్ఎస్ నాయకుడు మాజీ జెడ్పిటిసి కట్టా అజయ్ కుమార్ ల్యాప్ ట్యాప్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కు అందజేశారు. దాతలైన కట్టా కుటుంబ సభ్యులకు విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు,మాజీ సర్పంచ్ వేము రత్తమ్మ, మాజీ ఎంపిటిసి చిట్టిబాబు, స్థానిక ప్రముఖులు శ్రీనివాస్ రెడ్డి, మచ్చ హనుమంతరావు , జాస్తి వెంకటేశ్వరావు, చింతలపూడి ప్రసాద్,చింతలపూడి జనార్దన్, దేవభక్తిని రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.