calender_icon.png 4 February, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షులుగా లంకాల దీపక్‌ రెడ్డి..

04-02-2025 07:09:42 PM

సన్మానించిన బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యురాలు జి.అనూహ్య రెడ్డి..

ముషీరాబాద్ (విజయక్రాంతి): బీజేపీ హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షులుగా ఇటీవల నియమితులైన లంకాల దీపక్‌ రెడ్డిని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్య నిర్వాహక సభ్యురాలు పి.అనూహ్య రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ మేరకు మంగళవారం ఆమె నివాసంలో పార్టీ సీనియర్‌ నేతల ఆధ్వర్యంలో లంకాల దీపక్‌ రెడ్డికి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తనకు ఇచ్చిన ఈ బాధ్యతను అదృష్టంగా భావించి పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించిన అధిష్టానానికి ఈ సందర్బంగా దీపక్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే గ్రేటర్‌ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తానన్నారు. అనూహ్యా రెడ్డి మాట్లాడుతూ.. దీపక్‌ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. అనుహ్య రెడ్డితో పాటు పలువురు సీనియర్‌ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.