గెబెర్హా: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ధీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 67 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లంక 116 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. రికెల్‌టన్ (101), పాల్ వెరిన్నె (105*) శతకాలతో చెలరేగారు. మ్యాచ్‌లో మాథ్యూస్ 8వేల పరుగుల మార్క్ అందుకున్నాడు.