calender_icon.png 4 April, 2025 | 4:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాషోపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలి

03-04-2025 10:16:55 PM

తాడ్వాయి (విజయక్రాంతి): బాషోపాధ్యాయులు విద్యార్థులను మాతృభాషలో తీర్చిదిద్దాలని డిఈవో రాజు తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి ఉన్నత పాఠశాలలో గురువారం ఇటీవల జిల్లాలో పదోన్నతి పొందిన భాష ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా విచ్చేసిన డీ ఈ వో రాజు మాట్లాడుతూ తెలుగు భాష ఉపాధ్యాద్యాయు లు తెలుగులో విద్యార్థులను అక్షర దోషం లేకుండా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి తాడువాయి, రాజంపేట, లింగంపేట్, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, మహమ్మద్ నగర్, పిట్లం, పెద్ద కొడుకుకల్,డోంగ్లి, జూకల్,మద్దూరు మండలాల నుంచి ఉపాధ్యాయులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రామస్వామి రిసోర్స్ పర్సన్ పవన్ కుమార్, బసంత్ కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.