గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (విజయక్రాంతి): ప్రపంచ వేదికలపై రాణించాలంటే భాషా నైపుణ్యం కీలకమని ఉస్మానియా యూనివర్సిటీ ఛాన్స్‌లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
ఓయూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ సెంటర్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 66 మంది గిరిజన డిగ్రీ విద్యార్థులను ఎంపికచేసి నెలరోజులపా నిర్వహించనున్న ఇంగ్లీష్ శిక్షణను శుక్రవారం ఓయూ వీసీ ప్రొ.మొలుగారంతో కలిసి గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల అభ్యున్నతి, సాధికారత జరిగినపుడే వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందన్నారు.
ఆంగ్లంపై ప్రత్యేక్ష శిక్షణ విషయమై ఓయూ తొలి అడుగు వేశామని భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. ఓయూ వీసీ మెలుగారం మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాలకు సమ్మిళిత విద్య, సామాజికాభివృద్ధికి ఓయూ కృషి చేస్తుందని అన్నారు. గవర్నర్ ఆదేశాలకు అనుగుణంగా గిరిజన విద్యార్థులు ఆంగ్ల భాషలో నైపుణ్యం సాధించేలా సమగ్ర పాఠ్య ప్రణాళిక రూపొందించినట్లు ఈఎల్‌టీసీ డైరెక్టర్ ప్రొ.విజయ తెలిపారు.
నెలరోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రొ.కిష్టోఫర్, డా.నవీన్ సమన్వ చేస్తారన్నారు. కార్యక్రమంలో ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ.కాశీం, గవర్నర్ సంయుక్త కార్యదర్శి భవానీ శంకర్, ఓయూ రిజిస్ట్రార్ జీ నరేష్‌రెడ్డి, ఓఎస్డీ ప్రొ. జితేంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.