20-04-2025 06:01:46 PM
శ్రీనగర్,(విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. రాంబన్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడి దాదాపు 40 ఇళ్లు ధ్వసమయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, ఆస్తి నష్టం వాటిల్లింది. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు నిలిచిపోయ్యాయి. రాంబన్‌లోని ధరమ్‌కుండ్ ప్రాంతంలోని బాగ్నా వద్ద మేఘావృతం కారణంగా ఇల్లు కూలి ఇద్దరు పిల్లలు సహా ముగ్గురు మరణించారని అధికారులు ధృవీకరించారు. ఆకస్మిక వరదలు, బురదజల్లులలో చిక్కుకున్న వందకిపైగా మందిని రెస్క్యూ బృందాలు రక్షించి సురక్షిత ప్రదేశాలకు తరలించారు.
శ్రీనగర్-జమ్మూ హైవే (ఎన్హెచ్44)లో కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఐదు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయని, బనిహాల్-రాంబన్ హైవే వెంబడి వందలాది మంది ప్రయాణికులు, సరుకు రవాణా వాహనాలు నిలిచిపోయాయని అధికారులు పేర్కొన్నారు. రెండు హోటళ్ళు, అనేక దుకాణాలు, కొన్ని నివాస గృహాలు మరియు కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయని ఎస్‌ఎస్‌పి రాంబన్ కుల్బీర్ సింగ్ వెల్లడిచారు. . జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఉరుములు, వడగళ్ల తుఫానులు, వినాశకరమైన మేఘాల విస్ఫోటనంతో కూడిన కుండపోత వర్షాలు కురిసిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినట్లు డిప్యూటీ కమిషనర్ బసీర్-ఉల్-హక్ చౌదరి వ్యాఖ్యానించారు.
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ రాంబన్ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలతో సహా రాంబన్ ప్రాంతంలో వేగంగా గాలులు వీచి భారీ వడగళ్ల వాన పడ్డడంతో అనేక కొండచరియలు విరిగిపడయ్యాని వివరించారు. దీంతో జాతీయ రహదారి మూసుకుపోయిందని, దురదృష్టవశాత్తు 3 మంది ప్రాణనష్టం రెండు కుటుంబాలకు ఆస్తి నష్టం జరిగిందన్నారు. తను డిప్యూటీ కమిషనర్ మిస్టర్ బసీర్-ఉల్-హక్ చౌదరితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాని, సకాలంలో సత్వర చర్య తీసుకున్నందుకు జిల్లా యంత్రాంగం ప్రశంసలకు అర్హమైనదని పేర్కొన్నారు.