07-07-2024 12:44:31 AM
ఇద్దరు హైదరాబాద్ బైకర్లు మృతి
డెహ్రాడూన్, జూలై 6 : ఉత్తరాఖండ్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. శనివారం కురిసిన భారీ వర్షాలకు పలు చోట్ల కొండచరి యలు విరిగిపడ్డాయి. చమోలీ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు బైకర్లు మృతి చెందారు. కర్ణప్రయాగ, గౌచర్ మధ్యలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన నిర్మల్ షాహీ (36), సత్యనారాయణ (50) బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని బైక్‌పై తిరిగొస్తుండగా మార్గమధ్యంలో అకస్మాత్తుగా కొండచరి యలు విరిగి వారిపై పడ్డాయి. దీంతో వీరిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బద్రీనాథ్ జాతీయ రహదారిపై గౌచర్, కర్ణప్రయాగ్ మధ్య చత్వాపీపాల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానిక పోలీసులు మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కొండ చరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ నేషనల్ హైవే పలు చోట్ల ధ్వంసమై రాకపోకలు నిలిచిపోయాయి.