calender_icon.png 12 March, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ నిర్వాసితుల అభిప్రాయ సేకరణ

12-03-2025 12:00:00 AM

కాటారం, మార్చి 11 (విజయక్రాంతి) :  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పరిధిలోని పలు గ్రామాలలో చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు భూ నిర్వాసితుల అభిప్రాయ సేకరణ కార్యక్రమాలు నిర్వ హిస్తున్నట్లు తాసిల్దార్ నాగరాజు తెలిపారు. ఇందులో భాగంగా మం గళవారం కాటారం మండలం జాదరావుపేటలో అభిప్రాయ సేకరణ బహిరంగ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ హాజరయ్యారు.

కాగా ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు తగిన న్యా యం చేకూరుస్తామని, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సహాయ సహకారాలు అందిస్తామని సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్ పేర్కొన్నారు. కాలువల నిర్మాణానికి భూ నిర్వాసితులు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.