- రియల్ వ్యాపారం పుంజుకోవడంతో పెరిగిన భూసమస్యలు
- జిల్లాలో గుట్టలుగా పేరుకుపోతున్న భూసర్వే దరఖాస్తులు
- నిబంధనల ప్రకారం చలానా చెల్లించినా కదలని ఫైళ్లు
- కార్యాలయాల చుట్టూ జనాల ప్రదక్షిణలు
రంగారెడ్డి, డిసెంబర్ 4 (విజయక్రాంతి): జిల్లాలో రియల్ వ్యాపారం జోరందుకొంది. భూ లావాదేవీల విషయంలో ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుండా అమ్మకం, కొనుగోలు దారులు తగు చర్యలు తీసుకుంటు న్నా రు. ఈ నేపథ్యంలో భూలావాదేవీలు చేపట్టేవారు తమ భూములను సర్వే చేయాలం టూ తహసీల్ కార్యాలయాలు, ఆర్డీవో, జిల్లా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.
నిబంధనల మేరకు భూసర్వే కోసం ప్రభు త్వం నిర్ణయించిన ఫీజు చెల్లించిన రైతులకు తప్పనిసరిగా 45 రోజు ల్లో ఆ దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి క్షేత్రస్థాయి లో భూముల సర్వే చేసి పంచనామా రిపోర్ట్ రైతులకు ఇవ్వాలి. కానీ సర్వే అధికారులు సాకులు చెబుతూ తప్పించుకు తిరుగుతున్నా రు.
జిల్లాలో 27 మండలాలు, మూడు కా ర్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు కలిపి 13 మంది మాత్రమే సర్వేయర్లు ఉన్నారు. దాని కి తోడు ప్రభుత్వ అభివృద్ధి పనులు, ఆర్‌ఆర్‌ఆర్, ప్రాజెక్టుల భూముల సర్వేల పనులు ఉండటంతో సిబ్బంది కొరత కారణంగా ఉ న్న వారిపై పనిఒత్తిడి పెరిగిపోతుంది.
జిల్లా లో సర్వే అధికారుల కొరత కారణంగా రెండు నుంచి నాలుగు మండలాలకు ఒకే సర్వే అధికారి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నా రు. అత్యవసరంగా సర్వే చేయించుకొనే వా రు అధికారుల చేతులు తడిపి తమ పనిచేసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,200 కు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
మర్యాదలు చేస్తేనే..
సర్వేకు వచ్చే అధికారులకు రా నుపోనూ భత్యంతో పాటు అతిథి మర్యాదలు చేయాలి. లేకపోతే ఫైళ్లు ముందుకు కదలవు. కందుకూరు డివిజన్‌కు చెందిన ఓ అధికారి నిబంధనలకు విరుద్ధం గా సొంతంగా ప్రైవేట్ కార్యాలయాన్ని నడుపుతున్నాడు. సర్వే కోసం ఆర్జీ పెట్టుకున్న రై తులు అక్కడిని వెళ్లి కలవాల్సిందేనన్న ఆరోపణలున్నాయి.
సర్వే కోసం వచ్చే అధికారికి ముందస్తుగా నగదు ముట్టజెబి తేనే అతను సర్వేకు వస్తాడన్న ఆరోపణలున్నాయి. కొంద రు సర్వేయర్లు ప్రైవేట్ సర్వేయర్లను పెట్టుకు ని సర్వేను పూర్తి చేయించి అనంతరం తాపీ గా క్షేత్రస్థాయికి వచ్చి పత్రాలపై సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
రియల్ వెంచర్ల సర్వేపై మక్కువ
రైతుల భూముల సర్వేకు మక్కువ చూపని అధికారులు రియల్ వ్యాపారులు చేసే వెంచర్ల కోసం సర్వే అంటే ఎగిరి గంతేస్తున్నారు. రియల్ వెంచర్ చేసే సమయంలో వ్యవసాయ భూము ల నుంచి వ్యవసాయేతర భూములను మార్చేందుకు, నాలా కన్వర్షన్‌కు సర్వే తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉం టుంది.
దీంతో ఎకరానికి ఏరియాను బట్టి రూ.10 వేల నుంచి తీసుకొంటా రు. అంతేకాకుండా అధికారికంగా రైతులకు ప్రభుత్వానికి ఫీజును చెల్లించినా కూడా అనధికారికంగా ఎకరానికి రూ. 2 వేల నుంచి 3 వేలు ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. లేకపోతే ఫైళ్లను అలానే పెండింగ్‌లో పెట్టి రైతులను ఇబ్బందులు పెడుతున్నారు.