calender_icon.png 22 November, 2024 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన భూసర్వే అధికారి

22-11-2024 03:57:03 AM

డ్రాఫ్ట్ కాపీకి రూ.20 వేలు డిమాండ్

మహబూబాబాద్, నవంబర్ ౨౧ : మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో లంచం తీసుకుంటూ భూసర్వే అధికారి పట్టుబడింది. తెలిసిన వివరాల ప్రకారం.. కలెక్టరేట్ లోని  భూసర్వే రికార్డుల శాఖలో జ్యోతిశర్మ బాయి డ్రాఫ్ట్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నది. వరంగల్ కి చెందిన కార్తీక్ గుండ్రాతిమడుగు రెవెన్యూ పరిధిలో 2, 1/2 ఎకరాల భూమి కొనుగోలు చేయగా, భూమికి సంబంధించిన డ్రాఫ్ట్ కాపీ అడగగా రూ.5 వేలు కట్టాడు. అంనతరం రూ.20 వేల లంచం ఇస్తేనే డ్రాఫ్ట్ మ్యాప్ ఇస్తానని డ్రాఫ్ట్‌మెన్ తేల్చిచెప్పింది.

దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడు గురువారం ఆమెకు కలెక్టరేట్‌లో లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడిన అధికారి ఉద్యోగుల సంఘం ప్రతినిధి కావడం గమనార్హం. తాను నిజాయతీగా ఉంటూ ఇతర ఉద్యోగులకు ఆదర్శంగా నిలవాల్సిన అధికారి, ఇలా అవినీతి కేసులో పటుబడడం చర్చనీయాంశమైంది.