05-04-2025 02:36:09 AM
మోర్తాడ్ ఏప్రిల్ 4:(విజయక్రాంతి): మోర్తాడ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్మ సమాజ్ పార్టీ మోర్తాడ్ మండల అధ్యక్షులు ఉమేష్ మహారాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పథకాన్ని స్వాగతిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి భూమిని సమానంగా పంపిణీ చేసినప్పుడే ప్రజలందరూ ఆకలి తీరుతుందని అణగారిన వర్గాలకు ఆత్మగౌరవం ఏర్పడుతుంది అన్నారు.
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఆర్టికల్ 21 ప్రకారం మనిషికి జీవించే హక్కు ముఖ్యమని భావించి జీవించడానికి అవసరమైన పోషకాహారాన్ని ప్రభుత్వాలు ప్రజలకు అందించలేకపోతున్నాయి. మన రాష్ట్రంలో నిరుపేద నిత్య శ్రామిక ప్రజలు ప్రతిరోజు కూలి పని చేస్తే గాని పూట గడవని కుటుంబాలు ప్రజలు పోషకాహార లోపంతో రక్తహీనతతో అనారోగ్యం పాలవుతూ వారి శరీరాలు ఎముకల గూడుల మారిపోతున్నాయి.
దీనికి కారణం ప్రభుత్వాల విషపూరితమైన నిర్లక్ష్య వైఖరి మార్కెట్లో నిత్యవసర వంట సరుకుల ధరలు పెరిగిపోతుంటే నిరుపేద ప్రజలకు వాటిని కొనే ఆర్థిక స్తోమత ఉండడం లేదు ప్రతి రేషన్ కార్డుదారునికి బియ్యంతో పాటు పప్పు ధాన్యాలు గోధుమలు వంటనూనె గృహ వసరాలకు ఉపయోగపడే సరుకులు, న్యూట్రిషన్ ఫుడ్ ను ప్రభుత్వాలు సబ్సిడీతో పంపిణీ చేయడంలో విఫలమైంది అని విమర్శించారు.
పేద ప్రజలు సాగు చేసుకుంటున్నా అసైన్డ్ భూములను సైతం ప్రభుత్వాలు బలవంతంగా లాక్కొని కార్పొరేట్ వ్యవస్థలకు కట్టబెడుతున్నాయి మా భూమి మా చేతిలో ఉన్నప్పుడు శ్రామిక వర్గాల ఉత్పత్తి కులాల సాగు బడిలో ఆహార ఉత్పత్తి జరిగి ప్రజల ఆకలి తీరుతుంది ప్రతి ఒక్కరు పోషకాహారంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కంటే ప్రభుత్వం సమాన భూ పంపిణీ చేయడం ద్వారా పేద ప్రజలకు సబ్బండ వర్గాలకు అభివృద్ధి చేకూరుతుంది ఆత్మగౌరవం ఏర్పడుతుందని ఈ సందర్భంగా ఉమేష్ మహారాజ్ అన్నారు.