06-03-2025 12:51:27 AM
సిపిఐ జాయింట్ కలెక్టర్‌కు వినితి
యాదాద్రి భువనగిరి, మార్చి 5 ( విజయ క్రాంతి ): ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ఇల్లు లేని అరులైన నిరుపేదలకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ సిపిఐ ఆలేరు మండల శాఖ నాయకులు బుధవారం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఇళ్ల స్థలాలకు ప్రభుత్వ భూమి లేదని సాకులు చెబుతూ అధికారులు తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు.
కొలనుపాక గ్రామ సర్వేనెంబర్ 8 లో రెండెకరాల ప్రభుత్వ భూమి ఉందని అట్టి భూమిని అరులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలకై కేటాయించాలని నాయకు లు డిమాండ్ చేశారు. సొంత ఇల్లు లేక అనేకమంది పేద ప్రజలు ఇల్లల్లో కిరాయి కుంటూ చేసిన కష్టం కిరాయిలు చెల్లిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎన్నో వ్యయ ప్రయాసలకు గురవుతున్నారన్నారు. గతంలో కూడా ఇండ్ల స్థలాలకై ధర్నాలు చేసి వినతి పత్రాలు అందజేసిన పట్టించుకోక నిర్లక్ష్యం వహించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ప్రకటించి ఇంతవరకు స్థలాలు కేటాయించలేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఇచ్చిన వాగ్దానంలో వంద గజాలు ఇంటి స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని వెంకటేష్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ మండల పార్టీ కార్యదర్శి చౌడబోయిన కనకయ్య పార్టీ నాయకులు పొన్నబోయిన రవి, సామి, ప్రజానాట్యమండలి బాధ్యుడు ప్రవీణ్, మోతే భవాని సంపత్ లక్ష్మి, బిక్షపతి కవిత ఉప్పలమ్మ, యాదమ్మ లక్ష్మి ఎల్లమ్మ, రామ నర్సమ్మ. తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ కార్యాలయం ముందు అరులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని సిపిఐ పార్టీ ఆలేరు మండల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో అరులైన పేదలు అనేక రోజుల నుండి అద్దెలకుండి కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని కొలనపాకలో గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ కట్టించిన పక్కన ప్రభుత్వ స్థలం రెండు ఎకరాల భూమి ఉంది
గతంలో ఆలేరు ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా చేసి ఎమ్మార్వో గారికి మెమొరండం ఇవ్వడం జరిగింది మళ్లీ తరువాత భూమి మీదికి పోయి అరులైన పేదలతో ఎర్రజెండాలు నాటడం జరిగింది ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానాలు ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇంటింటి సౌభాగ్యం అని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది ఇప్పటికీ ప్రజా పాలనలో దరఖాస్తులు పెట్టుకున్న అనేకసార్ల దరఖాస్తులు ఇచ్చిన అరులైన పేదలకు ఇంటి స్థలాలు గాని ఇంద్రమిల్లి గాని రావ డం లేదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అరులైన పేదలకు 100 గజాలు ఇంటి స్థలం ఇ చ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వానికి సిపిఐ పార్టీ డిమాండ్ చేయ డం జరిగింది
జే సి గారికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య శాఖ కార్యదర్శి కొలనుపాక పొన్నబోయిన రవి గిరబోయిన సామి ప్రజానాట్య మండల్ బాధ్యుడు పోతు ప్రవీణ్ గారు వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు మోతే భవాని గారు సంపత్ లక్ష్మి గార బిక్షపతి కవిత ఉప్పలమ్మ బుచ్చి గారి యాదమ్మ లక్ష్మి ఎల్లమ్మ దార ఓదయ్య రామనరసమ్మ పాల్గొన్నారు