calender_icon.png 4 April, 2025 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డయాగ్నొస్టిక్ సెంటర్ కు భూమి కేటాయించాలి

03-04-2025 05:50:00 PM

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వినతి..

స్థలం కేటాయింపు సహకరిస్తానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి చెప్పిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పేదలకు తక్కువ ధరల్లో వివిధ పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు డయాగ్నస్టిక్ సెంటర్(Diagnostic Center) ఏర్పాటుకు భూమిని కేటాయించాలని మహబుబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) గురువారం హైదరాబాదులో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(State Governor Jishnu Dev Verma)ను కోరారు. రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర చైర్మన్, కార్యదర్శులతో కలిసి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ కి వినతిపత్రం సమర్పించారు. సహకారం అందించడం ద్వారా జరగనున్న మంచి గురించి క్లుప్తంగా వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. రెడ్ క్రాస్ సంస్థ(Red Cross Organization) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాగ్నొస్టిక్ సెంటర్ కి భూమి కేటాయించి అధునాతన భవన నిర్మాణానికి చేయూత ఇవ్వాలన్నారు. మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ సంస్థ ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎన్నో సంవత్సరాలుగా మహబూబ్ నగర్ ప్రజలకు ఆపత్కాలంలో సేవ అందిస్తూ, తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తాన్ని సేకరించి, అవసరమైన వారికి అందజేస్తుందని, మహబూబ్ నగర్ పట్టణంలో రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాగ్నొస్టిక్ సెంటర్ కోసం అధునాతన భవనం అవసరం ఉందని గవర్నర్ కి ఎమ్మెల్యే వివరించారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ... మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ సేవలు అమోఘం అని, పేద ప్రజలకు చేస్తున్న సేవలను ఇలాగే కొనసాగించాలని, రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాగ్నొస్టిక్ సెంటర్ కు అధునాతన భవన నిర్మాణానికి అవసరమైన భూమి కేటాయింపు చేయుటకు సహకరిస్తానని ఆయన ఎమ్మెల్యేకి హామీ ఇచ్చారు. 

అనంతరం మహబూబ్ నగర్ విద్యా నిధి గురించి ఎమ్మెల్యేని అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యా నిధి ఉద్దేశాలు, విద్యార్థులకు విద్యాతెలంగాణకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర చైర్మన్, కార్యదర్శులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. విద్యాభివృద్ధికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాగ్నొస్టిక్ సెంటర్ కోసం అధునాతన భవన నిర్మాణానికి అన్నివిధాలా సహకరిస్తామని గవర్నర్ హామీ ఇచ్చారన్నారు. అందుకు గవర్నర్ కి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. గవర్నర్ ను కలిసిన వారిలో ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ అజయ్ మిత్రా, రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ లయన్ నటరాజ్, రాష్ట్ర ఇసి సభ్యులు రమణయ్య తదితరులు ఉన్నారు.