* గడువులోగా పనులు పూర్తి చేయాలి
* సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌లను తయారు చేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికా రులను ఆయన ఆదేశించారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ పర్యటనలో భాగంగా హామీలు ఇచ్చిన నేపథ్యంలో.. వరంగల్ నగర అభివృద్ధిపై బుధవారం సచివాలయంలో మంత్రి కొండా సురేఖ, సీఎం ప్రధాన సలహా దారు వేంనరేందర్‌రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు.
ప్రధానంగా వరంగల్ నగర అభివృద్ధి, ఐఆర్‌ఆర్, ఓఆర్‌ఆర్, భద్రకాళి చెరు వు, విమానాశ్రయం తదితర అంశాలపై చర్చిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరంగల్‌లో నిర్మించే రింగ్‌రోడ్డు జాతీయ రహదారులకు కనెక్టివిటీ ఉండేలా చూడాలని, ఈ ప్రాజెక్టుకు భూసేకరణను యుద్ధ ప్రాతిపది కన చేపట్టాలని సూచించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, భద్రకా ళి చెరువు శుద్ధీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాధాన్యతా క్రమంలో పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యద ర్శి దాన కిశోర్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి, మైనింగ్ శాఖ కార్యదర్శి సురేం ద్రమోహన్, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్‌లు సత్య శారదా, ప్రావీణ్య, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.