23-04-2025 01:23:12 AM
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
హనుమకొండ, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించడానికే భూ భారతి - 2025 ఆర్‌ఓఆర్ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ధర్మసాగర్ మండల కేంద్రంలోని సుస్మిత గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన భూ భారతి అవగహన సదస్సులో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా భూ భారతి చట్టంలోని అంశాలను అధికారులు, రైతులకు వివరించారు. రైతుల సందేహాలను రెవెన్యూ అధికారులు నివృత్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని, వాటి ద్వారా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఇప్పుడు అలాంటి సమస్యలు తాలేత్తకుండా భూ భారతి చట్టాన్ని తెచ్చినట్లు వెల్లడించారు.
రైతుల సమస్యల పరిష్కారానికి ధరణి కంటే మెరుగైన భూ భారతి చట్టం అని అన్నారు. భూ భారతి ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడానికి, భూ రికార్డులలో జరిగిన తప్పులను సవరించడానికి అవకాశం లభించిదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10లక్షల సాదా బైనామా దరఖాస్తులను పరిష్కా రానికి భూ భారతి చట్టం ద్వారా మార్గం సుగమం అయిందని తెలిపారు.
అలాగే పార్ట్ బీ 18లక్షల ఎకరాలకు సంబందించిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవకాశం లభిస్తుందని అన్నారు. రైతులతో పాటు అధికారులకు ఒరియేంటేషన్ క్లాసులు నిర్వహించాలని తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించడానికి, రైతులకు మెరుగైన సేవలు అందించే విధంగా రెవెన్యూ సిబ్బంది పనితీరు ఉండాలని సూచించారు. ఆర్డివో తహసీల్దార్, రెవెన్యూ శాఖ అధికారులు, రైతులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.