25-03-2025 01:02:29 AM
హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి) : భూముల విలువ త్వరలోనే పెంచుతామని, భూ భారతి అమల్లోకి వచ్చాక రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్ గడువు ఈనెల 31 వరకు ఉందని, ఆ తర్వాత గడువు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి పేర్కొన్నారు.
మార్చి 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకుంటే 25 శాతం డిస్కౌంట్ వర్తిస్తుందని, ఆ తర్వాత ఇళ్లు కట్టుకోవడానికి పర్మిషన్ కావాలంటే 100 శాతం ఎల్‌ఆర్‌ఎస్ కట్టాల్సిందేనని మంత్రి స్పష్టంచేశారు. సోమవారం అసెంబ్లీ లాబీలోని ఆయ న ఛాంబర్‌లో మీడియాతో చిట్‌చాట్‌లో ఈ విషయం చెప్పారు. భూ భారతి పూర్తయిందని, త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ధరణి సమస్యలు దాదాపు పరిష్కారమైనాయని మంత్రి వివరించారు. ‘భూ సర్వే కోసం త్వరలో ప్రతీ మండలానికి సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్‌ను నియమిస్తాం. లైసెన్స్‌డ్ సర్వేయర్లకు అవకాశం ఇస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 6 వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు అవకాశం ఇస్తాం. మ్యాప్‌లేని వాళ్లకి కూడా సర్వే చేయించి నిర్ధారిస్తాం. 10,956 వీఆర్‌ఏ పోస్టులను మంజూరు ఇచ్చాం.
ఇప్పటికే ఉన్న వీఆర్‌ఏలకు ఇంటర్మీడియట్ విద్యార్హత పెట్టాం. భూమి సర్వే అనేది అమ్మకం, కొనుగోలుదారు రిక్వెస్ట్ మేరకే జరుగు తుంది. అది చట్టంలోనే ఉంది, ప్రభు త్వం ప్రత్యేకంగా భూ సర్వే ఏమి చేయ దు. పోజిషన్‌లో ఉన్న భూమి, రికార్డులకు చాలా తేడా ఉంది. ఎల్‌ఆర్‌ఎస్‌కు ఆశించిన మేర స్పందన ఉంది. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు గడువు పెంచాల నే ఆలోచన లేదు.
ఎల్‌ఆర్‌ఎస్ పేమెం ట్ అయ్యాక ఆలస్యం జరగదని చెప్పా రు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్దీకరణకు దృవీకరణ పత్రం ఇస్తుంది. ఎల్‌ఆర్‌ఎస్ చేయ కపోతే కొందరు సబ్‌రిజిస్ట్రార్లు ఇస్టానుసారం చేసి సస్పెండ్ అవుతున్నారు. దాని ని దృష్టిలో పెట్టుకొని ఎల్‌ఆర్‌ఎస్ తెచ్చాం. రిజిస్ట్రేషన్‌కు స్లాట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. అధార్‌తో లింక్ చేస్తాం.
ఒక్కో రిజిస్ట్రేషన్‌కు 15 నుంచి 20 నిమిషాల సమయంలో పూర్తవుతుంది. ఇప్పుడు దాదాపు 40 నిమిషాలు పడుతోంది. రాష్ట్రంలో దాదాపు 15 చోట్ల పైలె ట్ ప్రాజెక్టులు చేపడుతాం. అక్కడ వచ్చే ఇబ్బందులను అధిగమించి రాష్ట్రవ్యా ప్తంగా విస్తరిస్తాం’ అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
సాదాబైనామాల విషయంలో కొత్త దరఖాస్తులను స్వీకరించమని, గత ప్రభుత్వం హయాంలో అన్ లైన్‌లో నమోదైన 12 లక్షల సాదాబైనామాలు మాత్రమే పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం 13 లక్షల దరఖాస్తులను అప్ప టి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తిరస్కరించిందని, తిరస్కరించిన దరఖాస్తుల విష యంలో అపిలేట్ అథారిటీలో ఆప్పిల్ చేసుకోవచ్చునని తెలిపారు. అసైన్డ్ భూములను అమ్ముకోవడానికి అవకాశం లేదన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పేర్లలో మార్పు ఉండదు
‘ఇందిరమ్మ ఇళ్ల పేరులో ఎలాంటి మార్పు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ. 5 లక్షలు ఇస్తుంది. కేంద్ర ప్ర భుత్వం మాత్రం ప్రధాని అవాస్ యో జన కింద అర్బర్ ఏరియాలో 1.13 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. అర్బర్ ఏరియాలో నిర్మించుకునే ఇళ్లకు కేంద్రం రూ.1.50 లక్షలు మాత్రమే కేంద్రం ఇస్తుంది.
మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. గ్రామీణ ప్రాంతానికి సంబం ధించి ప్రస్తుతం కేంద్రం రూ. 72 వేలు ఇస్తుంది. ఇంకా ఏమైనా మార్పులు చేస్తుందో క్లారిటీ ఇవ్వలేదు’ అని మంత్రి తెలిపారు. ‘నాకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డితో పాటు ఏ ఎమ్మెల్యేతో సమస్య లేదు. నేను ఏ వ్యక్తికైనా రిప్రజెంటేషన్ జన్యున్‌గా లేకుండా చేయను.
ఎమ్మెల్యే అనిరుద్ చెబుతున్న అభిమన్యురెడ్డి అనే వ్యక్తి ఎవరో నాకు తెలియ దు. నాకు వివిధ సమస్యలపై రోజుకు 100 రిప్రజెంటేషన్లు వస్తాయి. అందు లో జెన్యూన్‌గా ఉంటే పరిష్కరిస్తాను’ అని మంత్రి పొం గులేటి తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ మొత్తం 41.6 కిలోమీటర్లు ఉంటుందని, అందు లో 9.5 కిలోమీటర్ల మేర పెండింగ్‌లో ఉందన్నారు.
పెండిం గ్ పడిన దగ్గరి నుంచి మ్యాన్‌వల్‌గా పనులు చేయాల్సి ఉంటుందని మంత్రి వివరించారు. ప్ర మాదఘటనలో చిక్కుకున్న మృతదే హాలను వెలికితీస్తామని మంత్రి పేర్కొన్నా రు. ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో రె స్క్యూఆపరేషన్ కొనసాగుతోందన్నారు.