calender_icon.png 19 April, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూముల పంచాయితీ

12-04-2025 01:33:33 AM

రూ.10 వేల కోట్ల స్కాం

  1. ‘కంచ’ భూముల తాకట్టు గోల్‌మాల్
  2. సీఎం కనుసన్నల్లోనే కుంభకోణం
  3. ఓ బీజేపీ ఎంపీ మధ్యవర్తిత్వం
  4. ఆర్బీఐ, సీబీఐ, సెబీకి లేఖలు రాస్తా
  5. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల్లో రూ.10 వేల కోట్ల అతిపెద్ద భూ కుంభకో ణం జరిగిందని, స్కామ్ అం తా సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ చక్రం తిప్పాడని చెప్పుకొచ్చారు. కంచ గచ్చిబౌలి భూములనే కాకుండా సీఎం హెచ్‌ఎండీఏ పరిధిలోని మరో రూ.60 వేల కోట్ల విలువైన భూములను కాజేసేందుకు పథకం ర చించారని వెల్లడించారు. తానిప్పుడే సదరు బీజేపీ ఎంపీ వివరాలు వెల్లడించలేనని, సీఎంకు ఎంపీకి మధ్య జరిగిన క్విడ్ అండ్ ప్రోకో ఒప్పందాలను త్వరలో ఆధారాలతో సహ బయటపెడతానని వివరించారు.

ఈ స్కాంలో ట్రస్ట్ అడ్వైజర్స్ ఇన్వెస్ట్‌మెంట్ అనే కంపెనీ మధ్యవర్తిత్వం చేసిందని, అందుకు గాను సదరు కంపెనీ రూ.170 కోట్లు తీసుకున్నదని చెప్పుకొచ్చారు. కంచ గచ్చిబౌలి భూముల్లో జరిగిన పర్యావరణ విధ్వంసంపై పర్యావరణ సామాజికవేత్తలు స్పందించారన్నారు.

రాత్రికి రాత్రి బుల్డోజర్లను పంపించి వందల ఎకరాల్లో చెట్లను కూల్చివేయడం, మూగ జీవాలకు నిలువ నీడ లేకుండా చేయడంపై తామకు అనేక అనేక అనుమానాలు వచ్చాయని, తాము లోతైన విచారణ చేయగా తెరవెనుక రూ.10 వేల కోట్ల స్కాం జరిగిందని గుర్తించామని తెలిపారు. 

నిబంధనలు, చట్టాల ఉల్లంఘన.. 

కంచ గచ్చిబౌలి భూముల అమ్మకం లేదా తాకట్టు పెట్టే అధికారం రాష్ట్రప్రభుత్వానిదేనని, కానీ.. 1996 సుప్రీం కోర్టు సదరు భూములు ముమ్మాటికీ అటవీ భూమేనని తేల్చిచెప్పిందని కేటీఆర్ గుర్తుచేశారు. తమవి కాని భూములను సర్కార్ ఎలా టీజీఐఐసీతో తాకట్టు పెట్టిస్తుందని నిలదీవశారు. రూ.10వేల కోట్ల రుణం ఎలా తీసుకువస్తారని ప్రశ్నించారు.

రాష్ట్రప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పులు, ఆర్బీఐ మార్గనిర్దేశకాలను తుంగ లో తొక్కి అటవీభూములను తాకట్టుపెట్టిందని, వాల్టా, అటవీ చట్టాల ఉల్లంఘన సైతం జరిగింద ని ఆరోపించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అంచనా ప్రకారం ఆ 400 ఎకరాల భూముల విలువ రూ.5,239 కోట్లు అని చెప్తుందని, కానీ.. రెవెన్యూశాఖ ప్రకారం అక్కడ ఒక్కో ఎకరా విలువ రూ.75 కోట్లు అని, అంటే 400 ఎకరాల విలువ రూ.30,000 కోట్లని తేలిపోయిందన్నారు.

భూ మి విలువను వారికి అనుకూలంగా మూడు సా ర్లు మార్చారని ఆరోపించారు. ఆ భూమికి యాజమాని ఎవరో తెలియకుండా, మ్యూటేషన్, రిజిస్ట్రే షన్ పత్రాలు లేని లిటికేషన్ భూమికి ఐసీఐసీఐ బ్యాంకు ఎలా రుణం ఇచ్చిందని నిలదీశారు.  పక్కా బ్రోకరిజంతో సర్కార్ రుణం తెచ్చుకుందని ఆరోపించారు.

లావాదేవీలు, మెసేజ్‌లు, సంభాషణలన్నీ మొబైల్స్, మెయిల్స్ మాధ్యమంగానే నడిచా యని వెల్లడించారు. కేవలం తానిప్పుడు వెల్లడించిన అంశాల ఆధారంగానే టీజీఐఐసీ బాధ్యులను జైళ్లో పెట్టొచ్చని, అందుకు తగిన ఆధారాలు సై తం తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు.

పీఎం, ఆర్థికమంత్రికి తెలియకుండానే..

ప్రధాన మంత్రి మోదీ, కేంద్రశాఖ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలియకుండా వ్యవహారమంతా నడిచిందని వెల్లడించారు. కేంద్రానికి చిత్త శుద్ధి ఉంటే వెంటేనే భూముల వ్యవహారంలపై సీవీసీ, సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశా రు. రూ.10 వేల బాండ్లను ఆర్బీఐ రద్దు చేయాలని, ఆ సంస్థలపై నిషేధం విధించాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్రం స్పందించకుంటే కాంగ్రెస్, బీజేపీ మధ్య ఒప్పందం ఉన్నట్లే అంటూ వ్యాఖ్యలు చేశా రు. అక్రమాలపై తాను అన్ని ఆధారాలను జత చేసి ఆర్బీఐ, ఎస్‌ఎఫ్‌ఐవో, సెబీ, సీవీసీ, సీబీఐ సం స్థలకు లేఖ రాస్తానని స్పష్టం చేశారు. అవసరమైతే కేంద్ర ప్రధానిని, ఆర్థికశాఖ మంత్రిని నేరుగా కలుస్తానని తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికల ప్రచా ర సమయంలో తెలంగాణలో కొందరు ఆర్‌ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోదీ వ్యా ఖ్యలు చేశారని, కానీ.. ఇప్పటివరకు ఎవరిపైనా, ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

అమృత్ స్కాంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి  తన బావమరిదికి రూ.కోట్లు దారి మళ్లించారని తాము ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి ఫి ర్యాదు చేశామని, దానిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవని ధ్వజమెత్తారు. రెవెన్యూశాఖ మం త్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ దాడులు జరిగినప్పటికీ, ఇప్పటివరకు దాడులపై ఈడీ నుంచి ఎలాంటి అధికార ప్రకటన లేకపోవడం అనుమానాలు దారి తీస్తుందని పేర్కొన్నారు.

ఆ బీజేపీ ఎంపీ ఎవరు?

రూ.10 వేల కోట్ల కుంభకోణంలో చక్రం తిప్పిన బీజేపీ ఎంపీ ఎవరు? అని మీడియా ప్రతినిధులు గుచ్చి గుచ్చి కేటీఆర్‌ను ప్రశ్నించగా.. ‘దొంగ చేతికి నేను ఇప్పుడే తాళాలు ఇవ్వలేను. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాననే విషయం ఆ ఎంపీకి తెలు సు. సమ యం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తా’ అని కేటీఆర్ ముక్తాయించారు. కేటీఆర్ చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్య లు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చ నీయాంశమ య్యాయి.

భూముల తాకట్టు విషయంలో మధ్యవర్తిత్వం చేసిన ఆ బీజేపీ ఎంపీ ఎవరు?.. అనే చర్చ మొ దలైంది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల తర్వాత సదరు బీజేపీ ఎంపీ కనుసన్నల్లోని బ్రోకర్ తెలంగాణలోనే కాకుండా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఇలాగే మధ్వవర్తిత్వం చేస్తున్నారా? ఇలాగే ఆయా రాష్ట్రాల్లోనూ కుంభకోణాలకు తెరతీశారా? అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి.

చర్చకు మీరు సిద్ధమా?

  1. వేల ఎకరాలు మీ అనుయాయులకు పంచిపెట్టింది వాస్తవం కాదా ?
  2. బిల్లీరావుతో చీకటి ఒప్పందాలు నిజం కాదా?
  3. కేటీఆర్‌పై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మండిపాటు

హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): ‘పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో పార్టీ పెద్దలు హైదరాబాద్ చుట్టు పక్కల వేలాది ఎకరాలు కొల్లగొట్టారు. తమ అనుయాయులు, అస్మదీయులకు పప్పూ బెల్లా ల్లా పంచిపెట్టిన సంగతి వాస్తవం కాదా? మాజీ కేటీఆర్ ఒక పెద్ద భూస్కాంలో ఐఎంజీ అధినేత బిల్లి రావుతో చీకటి ఒప్పందం చేసుకున్నారు. 30 శాతం పర్సంటేజీ కూడా మాట్లాడుకున్నారు.

ఆ ముడుపుల ఒప్పందం బెడిసి కొట్టిన సంగతి నిజం కాదా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాపై బురద చల్లడమెందుకు? బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన భూదోపిడీపై చర్చకు సిద్ధమా ? మేం సిద్ధం?’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సవాల్ విసిరారు.

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శుక్రవారం ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ , అమీర్ అలీఖాన్, ఎమ్మెల్యే శ్రీగణేశ్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్లలో కేసీఆర్ కుటుం బం చేసిన భూదోపిడీపై సీబీఐ విచారణ జరగాల్సి ఉందన్నారు. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయని అభిప్రాయపడ్డారు.

బీఆర్‌ఎస్ భూదోపిడిని ప్రజలు గమనించే కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారన్నారు. కేటీఆర్ సగం సగం చదువుకుని రాజకీయాల్లోకి వచ్చారని, ఏ విషయమైనా ఆయన పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. కేటీఆర్.. అసలు పేరు కే తారకరామారావు కాదని, డ్రామారావు పేరు అని పెట్టుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ పూటకో డ్రామా ఆడుతున్నారని దుయ్యబట్టారు. 

హెచ్‌సీయూ  భూములు ప్రైవేట్ పరంగా కాకుండా కాపాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని కొనియాడారు. టీజీఐఐసీ ద్వారా రూ.10 వేల కోట్ల ఒప్పందం చేసుకున్నది తమ కోసం కాదని,  ఆ సొమ్మును రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం వెచ్చించిందని స్పష్టం చేశారు. కానీ.. బీఆర్‌ఎస్ మాత్రం హెచ్‌సీయూ భూములపై అనేక కుట్రలకు పాల్పడిందని ఆరోపించారు.

నెమళ్లు, జింకలు రోదిస్తున్నాయంటూ సోషల్‌మీడియాలో అసత్య ప్రచారం చేయించిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఎవరినీ వదిలిపెట్టదని, నిజానిజాలు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

హెచ్‌సీయూ భూములను టీఎన్జీవోలకు కట్టబెట్టలేదా?

తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా ప్రతిపక్షాలు అడ్డుపడుతుతున్నాయని పీసీసీ చీఫ్ మండిపడ్డారు. ‘కేటీఆర్ అరెస్టును  అడ్డుకుంటుంది ఎవరో అందరికీ తెలుసు. ఆయన జైలుకెళ్లడం ఖాయం. ఈ ఫార్ములా రేస్‌లో తాను అరెస్ట్ అవుతాడని కేసీఆర్‌కు కూడా తెలుసు’ అని అభిప్రాయపడ్డారు.హెచ్‌సీయూకి చెందిన 134 ఎకరాల భూమిని గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం టీఎన్జీవోలకు కట్టబెట్టిందని గుర్తుచేశారు.

అప్పుడు కేటీఆర్‌కు ఆ భూములు వర్సిటీవి అని గుర్తులేదా? రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రయోజనం కలిగించేలా వర్సిటీ భూము ల్లో రోడ్డు వేయించింది బీఆర్‌ఎస్ కాదా?’ అంటూ ధ్వజమెత్తారు. బీజేపీతో బీఆర్‌ఎస్ అనైతిక బంధం కొనసాగి స్తున్నదని ఆరోపించారు. కంచ గచ్చిభూముల తాకట్టు వెనుక ఓ బీజేపీ ఎం పీ ఉన్నారని కేటీఆర్ చెప్తున్నారని,  48 గంటల్లో ఆ ఎంపీ పేరు చెప్తానని ప్రకటించి, ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేశారో ప్రజలకు చెప్పాల్సిందేనని నిలదీశారు.