calender_icon.png 29 April, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ భారతి చట్టంతో భూ సమస్యలు వేగంగా పరిష్కారం

28-04-2025 12:27:08 AM

ఖమ్మం/నేలకొండపల్లి, ఏప్రిల్ 27 ( విజయక్రాంతి ):-భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని, గ్రామాల్లో చేపడుతున్న రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు తహశీల్దార్లు వెంకటేశ్వర్లు, తఫజ్జుల్ హుస్సేన్ లు అన్నారు.  ఆదివారం నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం, రాజేశ్వరపురం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, భూ సమస్యలకు సంబంధించి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.

ఈ సందర్భంగా తహశీల్దార్లు మాట్లాడుతూ, రైతులకు తమ భూముల విషయంలో ఉన్న అభద్రత భావాన్ని తావు నీయకుండా జవాబుదారుతనాన్ని పెంచేందుకు భూ భారతి చట్టాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, ముటేషన్, నిషేధిత భూములు, ఆర్‌ఓఆర్ మార్పులు చేర్పులు వంటి సేవలు సులభతరం అవుతాయని తెలిపారు.

ఈ సందర్భంగా రామచంద్రాపురం గ్రామంలో చేపట్టిన రెవెన్యూ సదస్సులో భూ సమస్యలకు సంబంధించి 24, రాజేశ్వరపురం గ్రామ రెవెన్యూ సదస్సులో 182 దరఖాస్తులు అధికారులు స్వీకరించారు. స్వీకరించిన దరఖాస్తులకు అధికారులు రశీదులు అందజేశారు.ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండల ఆర్‌ఐలు రవి, మధు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.